Kajal Agarwal: ప్రస్తుతం సుందరాంగులందరూ సైడ్ బిజినెస్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ నుంచి డబ్బులు కోసం కొత్త దారులను వెతుక్కున్నారు అందాల భామలు. అయినా డబ్బుకు బాగా అలవాటు పడిన హీరోయిన్లు కదా, ఆ డబ్బు కోసం పరిధులు దాటడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు ఈ లిస్ట్ లో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా చేరింది.

పైగా పెళ్లి అయ్యాక, సంపాదన కాస్త తగ్గింది అట. అందుకే సంపాదన కోసం మళ్ళీ కసరత్తు మొదలెట్టింది. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ‘టీచర్స్’ బ్రాండ్ కి ఇన్ స్టాగ్రామ్ లో ప్రచారం కల్పిస్తూ.. పోస్ట్ కి ఇంత అని భారీ మొత్తంలోనే వసూళ్లు చేస్తోంది. దీపావళికి ఈ బాటిల్ తో సెలెబ్రేట్ చేసుకోండి అంటూ కాజల్ తన భర్తతో కలిసి చీర్స్ అంటూ మొత్తానికి మందు బాటిల్ ఎదురు పెట్టుకుని చక్కని ఫోజులిచ్చింది.
అయినా డబ్బుల వస్తున్నాయి కదా అని, ఇలా మందును కూడా ప్రమోట్ చేయడానికి కాజల్ ఆసక్తి చూపించడం విశేషమే. అయినా ఇందులో విశేషం ఏముంది ? ఆ మధ్య అనగా పెళ్లికి ముందు కాజల్ డబ్బులు కోసం ప్రముఖుల నైట్ పార్టీలో డ్యాన్స్ షోలు కూడా చేసేది అని ఆమె పై రూమర్ ఉంది. కాకపోతే అదంతా అప్పుడు గుట్టుగా నడిచేది.
కానీ ఇలా పబ్లిక్ గా మందు బాటిల్ ముందేసుకుని బాహాటంగా ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. ఇక భవిష్యత్తులో కాజల్ నుంచి ఇలాంటివి ఇంకెన్ని చూడాలో. నిజానికి ఒక్క కాజలే కాదు, ఇటీవల హీరోయిన్లు మందు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు. హీరోయిన్ రెజీనా కూడా ఆ మధ్య ‘టీచర్స్’ బ్రాండ్ ను తన ఇన్ స్టాగ్రామ్ వేదిక పై ప్రమోట్ చేసి క్యాష్ చేసుకుంది.
అసలు బ్రాండ్స్ అన్నీ హీరోయిన్ల వెంట పడటానికి ఒక కారణం ఉంది. మందు బ్రాండ్స్ ను టీవీల్లో, పత్రికల్లో ప్రోమోట్ చేసేందుకు మన చట్టాలు అంగీకరించవు కాబట్టి.. ఆ బ్రాండ్స్ ఓనర్స్.. తెలివిగా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి ఇలా ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాగా ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read: Varudu Kaavalenu: వరుడు కావలెను ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ !
ఈ క్రమంలో కాజల్ మందు ప్రచారం చేసింది. దాంతో ‘ఛీ.. డబ్బులు కోసం ఇంతగా దిగజారిపోతావా ?’ అంటూ, అలాగే అంటే రోజూ ఇద్దరూ కలిసి మందు వేస్తున్నారా?” అంటూ నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Anupama Parameswaran: రౌడీ బాయ్స్ మూవీ కోసం హద్దుమీరుతున్న అనుపమ…