KBR Park Incident: కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు మిస్టరినీ ఛేదించారు. ఇటీవల రాత్రి 8.40 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలు చౌరాసియా వాకింగ్ చేస్తుండగా దుండగుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించి సెల్‌ఫోన్ దొంగలించి పరారయ్యాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సనచలం సృష్టించింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ఐదురోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. నిందితులు చిత్ర పరిశ్రమలోనే పని చేస్తున్న లాట్మెన్ కె.బాబు(30)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ దర్యాప్తులో షాలూ నుంచి దొంగలించిన సెల్‌ఫోన్ కీలకంగా నిలించింది. పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం… గత ఆదివారం రాత్రి వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. బండరాయి ఉన్న వైపుకు తనను తోసి.. ఒక సందర్భంలో అదే బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. అయితే ధైర్యంతో బాధిత నటి తన మోచేతితో దుండుగుడిపై దాడి చేసి ఫెన్సింగ్ దూకి అక్కడ నుంచి తప్పించుకుంది.
ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలతో పాటు ఇటు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసు దర్యాప్తులో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెేలింది. దాడి చేసే నాలుగు రోజుల ముందే ఆ ప్రాంతాన్ని నిందితుడు పరిశీలించినట్లు తెలిసింది. చుట్టూ ఎవరూ లేరని, సిసిటీవి కెమెరాలు లేవని నిర్ధారించుకున్నాకే ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు దొంగతనం కేసులో దర్యాప్తు చేయగా.. తాను అత్యాచారం చేయడానికి వచ్చినట్లుగా దర్యాప్తులో నిందుతుడు ఒప్పుకున్నట్లు తెలిసింది.