
Katrina Kaif’s Wedding: సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్… యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ఘాడమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కత్రినా కైఫ్ తన పెళ్లి పై నిర్ణయం తీసుకుందని, ఆమె సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుందని ఆ మధ్య సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. దాంతో కత్రినా కైఫ్ మేనేజర్ రంగంలోకి దిగి ‘మా మేడం కి ఇంకా ఎలాంటి ఎంగేజ్ మెంట్ జరగలేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.

అయినా కోతల రాయుళ్లు మాత్రం కత్రినాను వదలలేదు. కత్రినా రహస్యంగా తన ఎంగేజ్ మెంట్ చేసుకుందని పెద్ద ఎత్తున ప్రచారానికి దిగారు. అలాగే విక్కీ కౌశల్ ను కత్రినా పెళ్లి కూడా చేసుకుందని కథనాలు అల్లారు. అయితే, కత్రినా ఆ కథనాల పై మాట్లాడుతూ ’15 ఏళ్లుగా నా పెళ్లి గురించి వింటూనే ఉన్నాను. అదేంటో తెలియదు గాని, మీడియాకి నా పెళ్లి పై బాగా ఇంట్రెస్ట్ ఉంది.
నాకు నెలకు ఒక్కో వ్యక్తిని అంటగడుతూ అతనితో నాకు పెళ్లి అయిపోయిందని వార్తలు రాస్తున్నారు’ అంటూ కత్రినా రీసెంట్ గా తన పెళ్లి పై కామెంట్స్ చేసింది. అయితే, బాలీవుడ్ మీడియాకి ఈ మధ్య మసాలా కంటెంట్ దొరకడం లేదు అనుకుంటా. కరెక్ట్ గా ఇదే సమయంలో కత్రినా తన బాయ్ ఫ్రెండ్ కి పబ్లిక్ గా ఘాటు ముద్దులు పెడుతూ గట్టిగా హగ్ చేసుకుంది.
ఆ విజువల్స్ చూసిన మీడియా ఇక తన పైత్యానికి పదును పెట్టింది. దాని ఫలితంగా గత కొన్ని రోజుల నుంచి కత్రినా గర్భవతి అంటూ.. కారణం విక్కీనే అంటూ వార్తలను వదిలారు. ఆ వార్తల పై మాత్రం కత్రినా మండిపడింది. ‘పెళ్లి మీరే చేస్తారు. చివరకు గర్భవతిని కూడా మీరే చేస్తారా ?’ అంటూ ఆమె మీడియా పై సీరియస్ అయింది.
అన్నట్టు స్టార్ హీరో రణబీర్ కపూర్, కత్రినాకి హ్యాండిచ్చి వదిలేసిన తర్వాత, ఒంటరితనంతో కత్రినా చాలా నలిగిపోయింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ తో డేటింగ్ స్టార్ట్ చేసింది. అతను ఆమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడు. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది లేండి. ప్రస్తుతానికి అయితే, కత్రినా, విక్కీ కౌశల్ ప్రేమలో మునిగి తేలుతూ సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది.
Also Read: విక్కి కౌశల్ తో పెళ్లి గురించి స్పందించిన కత్రినా కైఫ్