Katrina Kaif: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు గాంచిన హీరోయిన్ లలో కత్రినాకైఫ్ ఒకరు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు త్వరలో పెళ్లి వధువుగా మారనున్నారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. త్వరలోనే ఈ జంట పెళ్లి ముహూర్తం ఖరారు చేశారని బీ టౌన్ లో సమాచారం.

టాలీవుడ్ లో మల్లీశ్వరి తో అడుగు పెట్టారు కత్రినా కైఫ్. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు కత్రినా. ఆ తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు చిత్రంలో నటించారు కత్రినా. కానీ ఆ సినిమా ఆశించిన మేర ప్రేక్షకులను అలరించలేక పోయింది. దాంతో ఈ భామకు సరైన గుర్తింపు రాలేదనే చెప్పుకోవాలి.
గతంలో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ తో ప్రేమను కొనసాగించిన ఈ భామ ఎట్టకేలకు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. యూరీ నటుడు విక్కీ కౌశల్ తో గత కొన్ని ఏళ్లుగా కత్రినా కైఫ్ డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జోడి సీక్రెట్‌గా తమ లవ్‌ను కంటిన్యూ చేసారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి ముహూర్తం ఖరారయిందా అంటే అవుననే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. వచ్చే డిసెంబర్‌లో వీళ్లిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న “సూర్య వంశీ” చిత్రం దీపావళి కానుకగా త్వరలోనే విడుదల కానుంది. అలానే అజయ్ దేవ్‌గణ్, కత్రినా కైఫ్ కాంబోలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది.