ప్రమాద సమయంలో మహేశ్ డ్రైవింగ్ సీట్లో లేరని, పక్కన సీట్లో బెల్టు పెట్టుకోకుండా కూర్చున్నారని తనతో ప్రయాణిస్తున్న వ్యక్తి వెల్లడించారు. మహేశ్ వ్యాపార సన్నిహితుడు అయిన సురేష్ అనే వ్యక్తి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే మహేశ్ కు తీవ్ర గాయాల పరిస్థితి వచ్చిందన్నారు.
కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మహేశ్ సన్నిహితుడు మాత్రం ఆయన పరిస్థితి బాగానే ఉందని చెప్పినా వైద్యులు మాత్రం విషమంగా ఉందని చెప్పడం గమనార్హం.
కత్తి మహేశ్ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆక్సిజన్ సరిగా అందలేదు. మహేశ్ సన్నిహితుడు సురేష్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. ఆయన్ను వెంటనే వెంటిలేటర్ పై పెట్టాం. తరువాత ఐసీయూలోకి షిఫ్ట్ చేసి చికిత్స చేశాం. వారి కుటుంబ సభ్యులను పిలిచామన్నారు. దీంతో వారంతా చర్చించుకుని వేరే ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కత్తి మహేశ్ పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వివరించారు.