Katari krishna: ప్రకాశ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో చాణక్య, కృష్ణ, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా కఠారి కృష్ణ. పిఎ నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా ఇది. పోసాని కృష్ణ మురళి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్, పాటలను మురళీ మోహన్, తనికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కొరుకుంటున్నట్లు తెలిపారు.
యువతరం మెచ్చే విధంగా ఈ సినిమా ట్రైలర్, పాటలు ఉన్నాయని తనికెళ్ల భరణి అన్నారు. మరోవైపు దర్శకుడు తిరుమల శెట్టి మాట్లాడుతూ.. కొత్త కథాంశంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులన్ని అలరిస్తుందని అన్నారు. సినమాలో యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని అన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబరు చివర్లో విడుదలకు సిద్ధం కానుంది. ఈ చిత్రానికి పద్మనాభం భరద్వాజ్ సంగీతం అందించారు. మనీశ్, దివాన్ సినిమాటోగ్రాఫర్స్గా పని చేశారు.
కాగా, మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రంగా సముద్ర ఖని పాత్రను ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోరు. కటారి కృష్ణగా కనిపించి అందరి మనసులను గెలుచుకున్నారు. ఇందులో జయమ్మ పాత్ర కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి, వారి గతం గురించి సినిమాలో వివరించలేకపోయారు. మరి ఈ సినిమా వారిద్దరికి సంబంధించిందా లేక.. సరికొత్త కథతో రానున్నారా తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.