Katari Krishna Review: ప్రకాశ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో జాగో స్టూడియో బ్యానర్ పై పి. ఎ.నాయుడు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కఠారి కృష్ణ. కృష్ణ, చాణుక్య హీరోలుగా నటించగా.. రేఖా నిరోషా యశ్న చౌదరి, స్వాతి మండల్ హీరోయిన్స్‌గా నటించారు. పోసాని కృష్ణ మురళి, చంద్ర శేఖర్, టీఎన్ఆర్, మిర్చి మాధవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో కాలభైరవాస్టకం సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా థేయటర్లలో సందడి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా రివ్యూనూ ఇప్పుడు చూద్దాం.
తెలుగు ఆన్ లైన్ న్యూస్ రివ్యూ: 3/5
కథ: చిన్న పిల్లల మధ్య స్కూల్ ర్యాంక్ పోటీల్లో వేద అమ్మ ( మిర్చి మాధవి ) ఓదార్పుతో టైటిల్స్ మొదలుపెట్టి. .సినిమా స్టార్టింగ్‌లోనే మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు దర్శకుడు. కఠారి కృష్ణ కన్స్ట్రక్షన్ ఎండీ కృష్ణ తన భార్య గతం కోల్పోయి ఆసుపత్రిలో ఉండగా కృష్ణ ఎంటర్ అవ్వడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. డాక్టర్ మురళి కృష్ణ (పోసాని కృష్ణ మురళి ) సహాయంతో భార్య( శ్రీవల్లి )గతాన్ని మర్చిపోాడానికి గల కారణాన్ని తెలుసుకుంటూ.. అందుకు కారణమైన వాళ్లని వెతికే ప్రయత్నంలో సత్య పాత్ర రాకతో సినిమా మరో మెట్టుకు ఎదుగుతుంది. శ్రీవల్లి ఇంటిలో ఉండగా సత్య కృష్ణ మధ్య వచ్చే ఫైట్స్, ట్విస్ట్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వేద, గాయత్రి, శ్రీవల్లి, పెద్దయాక కూడా వారి మధ్య ర్యాంక్ పోరు అలాగే కొనసాగుతుంటుంది. అదే సమయంలో వేదను సత్య, శ్రీవల్లి కలిసి చంపేయడం.. అ సమయంలో వేదను ఎవరు చంపారో తెలుసుకునే ప్రాసెస్ లో కృష్ణ జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతాయి. ఇలా ప్రతి పది నిమిషాలకు సినిమా ఉత్కంఠంగా మారింది. వేద చావుకి కారణం ఎవరు? శ్రీవల్లి గతం కోల్పోవడానికి, గాయత్రి పిచ్చిది అవ్వడానికి కారణం ఎవరు? ఇదంతా ఎవరు చేశారు? ఈ మిస్టరీని కృష్ణ, చాణక్య ఎలా కనిపెట్టారు? వారి అంతు చూశారా? అనేదే మిగిలిన కథ..
సినిమా ప్లస్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్, ప్రధాన పాత్రల నటన, ప్రతి 15 నిముషాలకు వచ్చే ట్విస్ట్,ప్రస్తుత విద్యావ్యవస్థపై మంచి మెసే.జ్
మైనస్ పాయింట్స్: డి.ఐ. మిక్సింగ్, 5.1 మిక్సింగ్, రీ రికార్డింగ్.