https://oktelugu.com/

భగ్న ప్రేమికుడు.. ఎన్ఐఏ అధికారిగా మారాడు..!

హీరో కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సందడి మొదలైంది. #Happy Birthday Karthikeya అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో విషెస్ చెబుతున్నారు. కార్తీకేయ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాడు. కార్తీకేయ కొత్త సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ పతాకంపై రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్-100తో భగ్నప్రేమకుడిగా అలరించిన కార్తీకేయను ఎన్ఐఏ అధికారిగా దర్శకుడు మార్చబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్టు లుక్ ను కార్తీకేయ పుట్టినరోజు […]

Written By: , Updated On : September 21, 2020 / 09:35 AM IST
karthikeya

karthikeya

Follow us on

karthikeyaహీరో కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల సందడి మొదలైంది. #Happy Birthday Karthikeya అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో విషెస్ చెబుతున్నారు. కార్తీకేయ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాడు.

కార్తీకేయ కొత్త సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ పతాకంపై రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్-100తో భగ్నప్రేమకుడిగా అలరించిన కార్తీకేయను ఎన్ఐఏ అధికారిగా దర్శకుడు మార్చబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్టు లుక్ ను కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా దర్వకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ కార్తీకేయ గతచిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు. కొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు పేర్కొన్నాడు. ఇందులో కార్తీకేయ ఎన్ఐఏ అధికారిగా నటించనున్నాడు. కార్తీకేయ తొలిసారి ఢిపరెంట్ రోల్ చేస్తుండటంతో అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది.

‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కార్తీకేయ ‘ఆర్ఎక్స్-100’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పిస్తున్నాడు. హీరో నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో విలన్ నటించి మెప్పించాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘చావుకబురు చల్లగా’ అనే మూవీ చేస్తున్నాడు. దీంతోపాటు తమిళ హీరో విజయ్ సినిమాలో విలన్ గా నటించే అవకాశం సొంతం చేసుకున్నాడు.