https://oktelugu.com/

Karthikeya 2 OTT Release: కార్తికేయ 2 OTT విడుదల తేదీ వచ్చేసింది

Karthikeya 2 OTT Release: విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సినిమా నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 చిత్రం..విడుదల ముందు రోజు నుండే భారీ అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను మొదటి రోజు మొదటి ఆట నుండే అందుకుంది..తెలుగు లో ఈ సినిమా హిట్ అవుతుంది అని మనం అందరం ఊహించి ఉండొచ్చు. Also Read: NTR- […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2022 / 05:54 PM IST
    Follow us on

    Karthikeya 2 OTT Release: విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సినిమా నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 చిత్రం..విడుదల ముందు రోజు నుండే భారీ అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలను మొదటి రోజు మొదటి ఆట నుండే అందుకుంది..తెలుగు లో ఈ సినిమా హిట్ అవుతుంది అని మనం అందరం ఊహించి ఉండొచ్చు.

    Karthikeya 2 OTT Release

    Also Read: NTR- Prasanth Neel: ‘ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్’ ‌సినిమా కథ ఇదే.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక సంచలన అంచనాలే !

    కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా హిందీ లో సక్సెస్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. కేవలం 60 షోస్ తో ప్రారంభమైన ఈ సినిమా 2000 షోస్ తో ప్రదర్శితమవుతోంది అంటే ఈ సినిమా కి ఉన్న టాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గతం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆడింది. ఇప్పుడు ఈ సినిమా రన్ ని చూస్తుంటే ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా OTT కి బాగా అలవాటు పడిపోయిన జనం ఈ సినిమా ఎప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురు చూసేవారు కచ్చితంగా ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

    Karthikeya 2

    Also Read: Kartikeya 2 Collections: ‘కార్తికేయ 2’ 4 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

    అదేమిటి అంటే ఈ సినిమా OTT లో ప్రసారం అయ్యేది 6 వారాల తర్వాతేనట, ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. సినిమా కి థియేట్రికల్ రన్ అద్భుతంగా వస్తుండడం తో ముందస్తు OTT విడుదలకి భారీ ఆఫర్లు వచ్చిన మేకర్స్ ఒప్పుకోవడం లేదట. ఇక ప్రేక్షకులు OTT కోసం ఎదురు చూడకుండా థియేటర్స్ కి వెళ్లి చూడాల్సిందే, ఇటీవల కాలం లో సూపర్ హిట్ సినిమాలన్నీ ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు..దీని వల్ల థియేట్రికల్ రన్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హిట్ అయితే మినిమం 6 వారాలు అదే ఫ్లాప్ అయితే మినిమం మూడు వారాల్లోగా OTT విడుదల ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. వాళ్ళ అంచనా ప్రకారం ఈ పద్దతి ఫాలో అవ్వడం వల్ల థియేట్రికల్ రన్ మెరుగుపడుతుందో లేదో చూడాలి.