Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(Ss Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల అవ్వబోతుంది. రీసెంట్ గానే ఈ విషయాన్నీ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇది మంచి విడుదల తేదీనే కానీ, ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఐమాక్స్ స్క్రీన్స్ కోసం తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన కెమెరా ని ఉపయోగిస్తున్నారు. మూవీ లవర్స్ కి థియేటర్స్ లో అద్భుతమైన అనుభూతి కలగడానికి, ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో నింపేయబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఈసారి టార్గెట్ హాలీవుడ్ మార్కెట్ కాబట్టి , అక్కడి ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అయ్యే రేంజ్ లో హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఒక అడ్డంకి ఉంది.
ఈ సినిమా విడుదల అయ్యే సమయం లోనే మూడు భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. హాలీవుడ్ సినిమాలు విడుదల సమయం లో, ఫారిన్ దేశాలకు సంబంధించిన సినిమాలకు ఐమాక్స్ స్క్రీన్స్ ఇవ్వరు. అక్కడి నిర్మాతలు ఐమాక్స్ మరియు XD ఫార్మటు స్క్రీన్స్ మొత్తాన్ని నెల రోజుల ముందుగానే బుక్ చేసేసుకుంటారు. అలాంటి చోట ఆ సినిమాల కారణంగా ‘వారణాసి’ కి ఐమాక్స్ స్క్రీన్స్ దొరక్కపోవచ్చు అనే భయం అభిమానుల్లో నెలకొంది. ఐమాక్స్ కోసమే ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న సినిమాకు, ఐమాక్స్ స్క్రీన్స్ దొరకకపోవడం అంటే మామూలు నష్టం కాదు, సినిమా పొటెన్షియల్ ని వృధా చేయకండి, వేరే ఏదైనా మంచి విడుదల తేదీని ఎంచుకోండి అంటూ సోషల్ మీడియా లో మహేష్ బాబు అభిమానులు రాజమౌళి ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనిపై రాజమౌళి భవిష్యత్తులో స్పందిస్తాడో లేదో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఒక విషయాన్నీ గమనించాలి. రాజమౌళి మంచి విజన్ ఉన్న దర్శకుడు, ఇలాంటి పరిస్థితులను ముందే పసిగట్టగలడు. మరి అలాంటి రాజమౌళి ఉన్నప్పుడు భయం ఎందుకు అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఓవర్సీస్ దేశాల్లో విడుదల చేయబోతున్నది మరెవరో కాదు, డిస్నీ సంస్థ. ఈ మేరకు ఆ సంస్థ తో ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. మరి డిస్నీ సంస్థ ఐమాక్స్ స్క్రీన్స్ ని ఊరికే వదిలేస్తుందా చెప్పండి?, ఎన్ని హాలీవుడ్ సినిమాలు విడుదలైన వారణాసి క్వాటాలో కావాల్సినన్ని ఐమాక్స్ స్క్రీన్స్ దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే వారణాసి చిత్రం వల్లే హాలీవుడ్ సినిమాలకు థియేటర్స్ దొరక్కపోవచ్చు, రాజమౌళ అక్కడ, అంతా ఈజీ కాదు ఆయనతో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.