https://oktelugu.com/

Actor Manoj Naidu : పెళ్లయిన మహిళతో నటుడి ఎంజాయ్‌.. భర్త రాగానే ఏం జరిగిందంటే?

మనోజ్‌నాయుడు పెట్టే హింసపై ఇంటర్‌ చదువుతున్న కొడుకు తల్లి స్మితకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. కానీ ఆమె కోపంలో అలా చేసి ఉంటాడని సర్దిచెబుతూ వచ్చింది. తాను మాట్లాడతానని చెప్పి.. మనోజ్‌నాయుడును ఏమీ అనకపోవడంతో పిల్లలు మరింత మనస్తాపం చెందారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 15, 2023 / 04:24 PM IST

    Actor Manoj

    Follow us on

    Actor Manoj: వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. హత్యలకు దారితీస్తున్నాయి. తమ సంబంధాని అడ్డుగా ఉన్నారని భర్తను, పిల్లలను ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి అడ్డు తొలగించిన ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ తరహాలోనే మరో ఘటన హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేటలో కాల్పులకు కారణమైంది. అయితే తృటిలో మహిళ భర్త తప్పించుకున్నాడు.

    వివాహితతో సీరియల్‌ నటుడు సహజీవనం
    హైదరాబాద్‌ శివారులోని ఓ సెలబ్రిటీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు సీరియల్‌ నటుడు మనోజ్‌ నాయుడు. ఇతడు వివాహిత స్మితతో సహజీవనం చేస్తున్నాడు. స్మితకు అప్పటికే పెళ్లయి ఇంటర్‌ చదువుతున్న కొడుకు, 13 ఏళ్ల కూతురు ఉన్నారు. స్మిత భర్త విశాఖలోని ఓ విద్యుత్‌ సంస్థలో ఉద్యోగి. భర్తతో విభేదాలు రావడంతో హైదరాబాద్‌కు వచ్చిన స్మిత సీరియల్‌ నటుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది సహజీవనానికి దారితీసింది. కొన్నాళ్లు స్మిత, ఆమె పిల్లలను మనోజ్‌నాయుడు బాగానే చూసుకున్నాడు.

    మోజు తీరాక విశ్వరూపం..
    స్మితతో 2019 నుంచి ఎంజాయ్‌ చేసిన మనోజ్‌నాయుడు ఇప్పుడు ఆమెపై మోజు తీరడంతో వేధించడం ప్రారంభించాడు. స్మిత పిల్లలపై దాడిచేస్తున్నాడు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందని తెలిసి కూడా ఇంటికి ఫ్రెండ్స్‌ను తీసుకువచ్చి పార్టీలు చేయడం మొదలు పెట్టాడు. పార్టీ సమయంలో స్నాక్స్‌ చేసి ఇవ్వాలని పిల్లలను వేధించేవాడు. దాడిచేసేవాడు. తన కార్లు తుడవాలని, కడగాలని కొట్టేవాడు. ఇలా అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టాడు.

    తల్లికి చెప్పినా పట్టించుకోలేదు..
    మనోజ్‌నాయుడు పెట్టే హింసపై ఇంటర్‌ చదువుతున్న కొడుకు తల్లి స్మితకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. కానీ ఆమె కోపంలో అలా చేసి ఉంటాడని సర్దిచెబుతూ వచ్చింది. తాను మాట్లాడతానని చెప్పి.. మనోజ్‌నాయుడును ఏమీ అనకపోవడంతో పిల్లలు మరింత మనస్తాపం చెందారు.

    సీడబ్ల్యూసీకి ఫిర్యాదు..
    తల్లికి విషయం చెప్పామని తెలిసి మనోజ్‌ నాయుడు మరింత టార్చర్‌ పెట్టడంతో స్మిత కుమారుడు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)కి లేఖ రాశాడు. మనోజ్‌నాయుడు పెడుతున్న టార్చర్‌ను లేఖలో వివరించాడు. దీనికి స్పందించిన సీడబ్ల్యూసీ ఈనెల కూతురుతో హాజరు కావాలని తల్లి స్మితను ఆదేశించింది. ఇదే విషయాన్ని కొడుకు ఇటీవల తండ్రి సిద్దార్ద్‌దాస్‌కు ఫోన్‌చేసి చెప్పాడు మనోజ్‌నాయుడు పెట్టే టార్చర్‌ వివరించి కన్నీరుపెట్టుకున్నాడు. తనతోపాటు చెల్లిని కొడుతునానడని ఆవేదన వక్తం చేశాడు.

    పిల్లలను తీసుకెళ్లేందుకు వస్తే..
    భార్య గురించి ఆలోచించని సిద్దార్థదాస్‌ శనివారం ఉదయం సెలబ్రిటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న మనోజ్‌నాయుడుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన మనోజ్‌నాయుడు ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. తప్పించుకున్న సిద్దార్థదాస్‌ వెంటనే శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

    భర్తతో విభేదాలతో హైదరాబాద్‌కు వచ్చిన స్మిత..
    స్మితకు విద్యుత్‌ ఉదోయగి అయిన సిద్ధార్థ్‌ దాస్‌తో పెళ్లయింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా 2019లో స్మిత పిల్లలను తీసుకుని హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే మనోజ్‌ నాయుడుతో పరిచయం సహజీవనానికి దారితీసింది.

    పిల్లల కోసం సిద్దార్ధదాస్‌ ప్రయత్నాలు..
    భార్య దగ్గర ఉన్న తన పిల్లలను తన సంరక్షణలోకి తీసుకోవడానికి సిద్ధార్థ్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మనోజ్‌నాయుడు టార్చర్‌ పెడుతున్నాడని కొడుకుఫోన్‌ చేయడంతో శనివారం సెలబ్రిటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. పిల్లలను చూసేందుకు వస్తే తనపై మనోజ్‌ కాల్పులు జరిపాడని సిద్దార్థదాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.