ఈ మాట విన్న కార్తిక్ అది జైల్లో ఉన్న నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అంటూ చిరాకుపడతాడు. రత్నసీత మాటవిన్న కుటుంబ సభ్యులు మోనిత ఇప్పుడు ఏం చేస్తుందో అని కంగారు పడతారు. ఈ లోగా సౌందర్య అందులో ఏముందో చూడమని దీపకు చెప్పగా.. దీప ఆ బ్యాగ్ లో నుంచి చిన్నపిల్లల పోస్టర్లు వాటితోపాటు ఒక లెటర్ బయటకు తీస్తుంది. అవి చూసిన కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇక లెటర్ తీసి చూడగా అందులో మనకు పుట్టబోయే బిడ్డ అంటూ కార్తీక్ ను రెచ్చగొట్టే మాటలు రాసింది.
ఇక అంతలోపు అక్కడికి పిల్లలు రావడంతో ఆ పోస్టర్లు చూసి చాలా బాగున్నాయి ఎవరు తెచ్చారు అని అడగగా బాబాయ్ తెచ్చాడని సమాధానం చెప్పి తప్పించుకుంటుంది. దీపు కోసం బొమ్మలు తేవాలి గాని ఫోటోలు తీయడం ఏంటి అని పిల్లలు అక్కడి నుంచి వెళ్తారు.మోనిత చేసిన పనికి దీప సౌందర్య ఆనందరావు ఆ పోస్టర్లు చూసి అర్థం కాని పరిస్థితులలో ఉంటారు ఇక కార్తీక్ తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పుట్టబోయే బిడ్డకు నాన్న పేరు ఆనంద్ అని పేరుకూడా పెట్టిందని చిరాకు పడతాడు.
అది జైల్లో ఉన్న ప్రశాంతంగా ఉండ నివ్వడం లేదంటూ కార్తీక్ చిరాకు పడటంతో సౌందర్య దీపా కార్తీక్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఎప్పటికైనా మోనిత మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మరి మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెబుతోంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఏసిపి రోషిని మోనిత డీటెయిల్స్ తీసుకుంటున్న సమయంలో మోనిత తన పేరును మోనిత కార్తీక్ అని చెప్పడమే కాకుండా తన అడ్రస్ కూడా కార్తీక అడ్రస్ చెప్పడంతో రోషిని కోపంతో రగిలిపోతుంది.ఇక స్టేషన్ లో ఎవరూ లేని సమయం చూసి రత్న సీత కార్తిక్ ఇంటిలో జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తుంది.
మోనిత మాత్రం కార్తీక్ ఎలా ఉన్నాడు బాగున్నాడా అంటూ పొంగిపోతోంది. ఇక పిల్లలు బయట ఆడుకుంటూ ఉండగా ఆదిత్య రావడంతో పిల్లలు దీపుకి బొమ్మలు కాకుండా పోస్టర్లు తెచ్చావ్ ఏంటి బాబాయ్ అంటూ అడుగుతారు. వెంటనే ఆదిత్య నేనేం తేలేదని చెప్పడంతో షాక్ అయిన పిల్లలు అమ్మ మళ్లీ అబద్ధం చెప్పిందని కోప్పడతారు. ఇక మోనితను ఒక గంటలో కోర్టుకు తీసుకు వెళ్తారు అక్కడికి కార్తీక్ కూడా వస్తాడు అని తెలియడంతో ఆ గంట ఎప్పుడు అవుతుందా అంటూ ఎదురుచూస్తుంది.ఇక కార్తీక్ కోర్టుకు వెళ్లాలనే విషయం ఇంటిలో తెలియడంతో ఆ మోనితకి శిక్ష పడుతుందని ఆదిత్య మాట్లాడుతుండగా దీప అయ్యో మోనితకి శిక్ష పడుతుందా అన్నట్లు బాధగా ఉంటుంది.