Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ఫిష్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దీపా అమెరికా వెళ్తున్న సమయంలో వారణాసికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది. లోపలికి వెళ్లగానే ఆనందరావు ఆదిత్య శ్రావ్య ఎంతో షాక్ అవుతూ నిలబడతారు. పైనుంచి సౌందర్య వస్తూ ఏంటి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడగగా పేపర్లో మోనిత న్యూస్ చూసి అందరూ షాక్ అవుతారు. జైలు నుంచి విడుదల అవుతున్న ఈ వింత ప్రేమికురాలు.. కృత్రిమ గర్భం ధరించి తనను డాక్టర్ పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతూ ఎన్నో ఆరోపణలు చేసిన మోనిత గర్భవతి కావడంతో ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారని ప్రకటన ఉంటుంది.

ఇలా అందరూ షాక్ అవ్వగా దీప మాట్లాడుతూ ఏంటి అత్తయ్య ఇది అది ఇప్పుడే బయటకు రావాలా మేము అమెరికా వెళ్ళిన తర్వాత రావచ్చు కదా అంటూ అనడంతో సౌందర్య ఏంటి ఇప్పుడు భయపడుతున్నావా మీ అమెరికా ప్రయాణం క్యాన్సల్ అవుతుంది అనుకున్నావా ఏం కాదు కార్తీక్ రాగానే మీరు బయలుదేరుతారు అని చెబుతుంది.ఇక ఈ విషయం పిల్లలకు తెలియకూడదని శ్రావ్య పేపర్ దాచగ దీప పిల్లలందరినీ పిలిచి చూడండి మోనిత జైలు నుంచి విడుదల అవుతుంది అంటూ వాళ్లకు నిజం చెబుతుంది ఇప్పుడు మాకు ఎందుకు చూపిస్తున్నావు అనగా మీరు అబద్ధాలు చెబుతున్నారు అని అంటున్నారు కదా మళ్లీ మీరు అలా మాట్లాడకూడదని అని చెబుతున్నాను అంటూ దీప చెబుతుంది.
ఇక కార్తీక్ డాక్టర్ రవి భారతి ఇంటికి వెళ్తాడు అయితే అదే సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండడంతో లోపలికి వెళ్లడానికి వీల్లేదని చెప్పగా పని వాడు వచ్చి అంటే తను మా సార్ ఫ్రెండ్ అని చెప్పడంతో కానిస్టేబుల్ లోపలికి పంపిస్తుంది. అలా లోపలికి వెళ్లిన కార్తీక్ బయట గార్డెన్ లో సోఫాలో కూర్చొని ఉండగా లోపల రవి భారతితో గొడవ పడతాడు ఏంటి ఇదంతా ఇప్పటి వరకు జరిగింది చాలాదా మళ్లీ ఈ టెన్షన్స్ ఎందుకు మనకు అవసరమా అంటూ తనని తిడతాడు.నాకు మీ కన్నా ఎక్కువగా టెన్షన్ ఉంది కానీ ఇలా సరాసరి ఇంట్లోకి అంటూ భారతి టెన్షన్ పెడుతుంది.
భారతి ఇంట్లో ఉన్న మోనిత తన కడుపు పై చేయి వేసుకుని మురిసిపోతుంటే భారతి వెళ్ళి తనకు టీ ఇస్తుంది. నన్ను కార్తీక్ హాస్పిటల్ కి తీసుకెళ్ళు భారతి అనగా భారతి మొహంలో కంగారు చూసి ఏంటి భయపడుతున్నావా అని అంటూ నేనంటే నీకు కూడా లోకువ అయిపోయిందా అని తన చేతిలో ఉన్న టీ కప్పు విసిరి కొడుతుంది.ఆ శబ్దం విన్న కార్తిక్ బారతి, రవి మధ్య ఏదో గొడవ జరుగుతుంది ఈ టైంలో వచ్చానని అక్కడి నుంచి లేచి వెళ్తాడు. అదేసమయంలో టీపాయ్ పై ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడిపోవడంతో దానిని పెట్టేటప్పుడు పేపర్ లో ఉన్నటువంటి మోనిత న్యూస్ చదివి షాక్ అవుతాడు. అది చదివిన కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నం చేయగా అంతలో పని వాడు వచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్తాడు. మోనిత మాటలకు లొంగిపోయిన భారతి కార్తీక్ అమెరికా ప్రయాణాన్ని ఆపుతుందా.. లేకపోతే కార్తీక్ అమెరికా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.