Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7కి నగారా మోగింది. ఆగస్టు నుండి షో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక ఇప్పటికే పూర్తి కాగా… కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దానికి పలు కారణాలు ఉన్నాయి. గేమ్స్, ఛాలెంజెస్ లో కొత్తదనం లేదు. కంటెస్టెంట్స్ లో పసలేదు. నాగార్జున హోస్టింగ్ కూడా విమర్శలపాలైంది. దాంతో ఈసారి సీజన్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కొంచెం పేరున్న కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపాలని డిసైడ్ అయ్యారు.
పాపులారిటీ లేని వాళ్ళను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయడం సరికాదని, ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని నిర్వాహకుల భావన. ఈ క్రమంగా బుల్లితెర, వెండితెరతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇటీవల వివాహం చేసుకున్న సీరియల్ నటుడు అమర్ దీప్ భార్యతో పాటు జంటగా హౌస్లో అడుగుపెడుతున్నారట. గతంలో వరుణ్ సందేశ్, రోహిత్ భార్యలతో పాటు హౌస్లో కంటెస్ట్ చేశారు. ఈ లిస్ట్ లో అమర్ దీప్ చౌదరి చేరారని అంటున్నారు.
అలాగే జబర్దస్త్ వర్ష, ఈటీవి ప్రభాస్, సింగర్ మోహన భోగరాజు, బ్యాంకాక్ పిల్ల, నటి శ్రీవాణి అంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా కార్తీక దీపం సీరియల్ నటి శోభిత శెట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. సీరియల్స్ లో కార్తీక దీపం రారాజుగా వెలుగొందింది. టీఆర్పీలో నేషనల్ రికార్డ్స్ బద్దలు కొట్టిన చరిత్ర ఆ సీరియల్ సొంతం. ఈ సీరియల్ లో శోభిత శెట్టి మోనిత అనే లేడీ విలన్ క్యారెక్టర్ లో సీరియల్ కి ఆయువు పట్టులా నిలిచింది.
ఆమెకు తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ ఉంది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు బాగా మాట్లాడుతుంది. దీంతో బిగ్ బాస్ తెలుగు 7కి ఆమెను ఎంపిక చేశారట. అలాగే భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారట. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ 7కి హోస్ట్ మారతాడని ప్రచారం జరిగింది. కానీ నాగార్జునే వరుసగా ఐదో సారి ఆ బాధ్యత తీసుకున్నారు. ఈసారి హౌస్లో గేమ్స్, ఛాలెంజెస్, టాస్క్స్ కొత్తగా ఉంటాయని ఆయన చెప్పుకొస్తున్నారు.