స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ ఇష్టం లేకపోయినా పూజ కోసం కారులో ప్రయాణం చేస్తుంటాడు. ఇలా డ్రైవ్ చేస్తున్న సమయంలో దీప గుర్తుకు రావడంతో వెంటనే బ్రేక్ వేస్తాడు. నావల్ల కాదు మమ్మీ నేను రాలేదని చెప్పడంతో సౌందర్య తనని బతిమాలుతోంది. నీ మంచి కోసమే నేను చేసేది ఒక్కసారి నా మాట విను కార్తీక్ అంటూ తనని గుడికి తీసుకు వెళుతుంది. మరోవైపు మోనిత సిద్ధమయ్యే డ్రైవ్ చేసుకుంటూ ప్రియమణితో సహా గుడికి బయలుదేరుతారు.
ఈ సందర్భంగా మోనిత మాట్లాడుతూ అసలు నా విజయం మామూలుది కాదు ప్రియమణి. సౌందర్య ఏంటి నన్ను పూజకు పిలవడం ఏంటి,అది కార్తీక్ పక్కన కూర్చొని పూజ చేయడం ఏంటి అంతా ఈ బుల్లి ఆనంద రావు గారి వల్లే అంటూ తన కొడుకుని చూసి మురిసి పోతుంది. ఇక వారణాసి కారులో బయలుదేరిన దీప ఎంతో కంగారు పడుతూ ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అని కంకణం కట్టుకుంది. ఈక్రమంలోనే వారణాసిని అటు వెళ్ళు వెళ్ళు అంటూ అడ్రస్ చెబుతుంది.
ఇక గుడి దగ్గరకు కార్తీక్ వెళ్ళగానే తన చేతిని పట్టుకుని సౌందర్య లోపలికి తీసుకెళ్లడంతో పంతులుగారు మీ కోడలు రాలేదా అంటూ మోనిత గురించి అడగడంతో కార్తీక్ ఎంతో ఆవేశ పడతాడు. ఆ సమయంలో పూజ అయిపోయే వరకు నువ్వు ఏమీ మాట్లాడకు అంటూ సౌందర్య చెబుతుంది. అదే సమయంలో ని కార్తీక్ బట్టలు మార్చుకోవడానికి వెళ్లి వస్తుండగా మోనిత అక్కడికి వచ్చి ఆగడంతో కారు దిగిన మోనిత ప్రియమణి చెవిలో ఏదో పెద్ద ప్లాన్ చెబుతుంది. అందుకు ప్రియమని సరే అని చెబుతుంది. అలా గుడి దగ్గరకు రాగానే కార్తీక్ ను చూడగానే మోనిత ఎంతో మురిసి పోతుంది. కార్తీక్ మాత్రం ఎంతో అసహ్యించుకుంటూ ఉండగా తన చేతిని పట్టుకుని వెళ్లి పీటలపై కూర్చుంటుంది.
కావాలని మెళ్ళో తాళిని వేసుకున్న మోనిత రేపొద్దున కోర్టులో సాక్ష్యం చెప్పడానికి పంతులు గారు అలాగే హాస్పిటల్లో కార్తీక్ తన భర్తగా సంతకం చేసిన పేపర్లను అన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇలా కార్తీ పక్కన కూర్చుని పూజ చేస్తూ ఎంతో మురిసి పోతుంది.ఇక మరోవైపు దీప వీరి ప్లాన్ అంతా బయట పెట్టాలని అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అదే గుడికి వెళుతుంది. మరి దీప అక్కడికి వచ్చి ఏం చేయబోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.