బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు అత్యంత ప్రేక్షకాదరణ తగ్గించుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ అధిక రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో భాగంగా పిల్లలిద్దరూ సౌందర్యతో మాటలు పెట్టుకుని కూర్చుంటారు. అప్పుడు అందరం ఎంతో చక్కగా బయటికి వెళ్ళే వాళ్ళం ఈ మధ్య బయటికి వెళ్లడమే లేదు ఎలాగో అమ్మ పుట్టినరోజు కదా గోల్కొండ కోటకి వెళ్దామని చెప్పడంతో సౌందర్య దీప పుట్టినరోజు అంటూ అడుగుతుంది.
ఆ సమయంలోనే దీప రావడంతో ఈరోజు నీది పుట్టినరోజా అని అడగడంతో రోజు చస్తూ బతికే వారికి పుట్టిన రోజు ఏంటి అత్తయ్య అంటూ సౌందర్యకి తగిలేలా మాటలు మాట్లాడుతుంది. పిల్లలు నీ పుట్టిన రోజు అని గోల్కొండ కోటకు వెళ్దాం అని అడుగుతున్నారు వెళ్దాం అని చెప్పగా గోల్కొండ కోట కాదు పక్కనే ఉన్న సమాధులు చూడడానికి వెళ్ళండి అంటూ అపశకునము మాటలు మాట్లాడుతుంది. దీంతో సౌందర్య కోపం తెచ్చుకుంటుంది. ఇక గుడికి అయినా వెళ్దామని పిల్లలు అడగగా మీ నానమ్మ డాడీ కలిసి వెళ్లారు కదా అంటూ ఉంటుంది. ఇక దీపావళి పండుగ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ సౌందర్యకు బాధ కలిగించేలా పిల్లలకు చెప్పడంతో సౌందర్య అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది.
ఇలా పిల్లలతో కాసేపు మాట్లాడిన దీప దీపావళి పండుగ అంటే ఇష్టమని తన పేరులో కూడా దీప ఉంది కనుక ఈ పండుగ ఇష్టం అని తెలిపారు.సౌందర్య గదిలో కూర్చుని దీప అన్న మాటలను తలుచుకుని ఏడుస్తుండగా ఆనందరావు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఆ సమయంలో దీపం ఇలాంటి మాటలు మాట్లాడింది అని చెప్పి సౌందర్య బాధపడుతుంది. ఇక మోనితను కలవడానికి వెళ్లిన కార్తీక వచ్చేసరికి దీప ఎంతో అందం గా రెడీ అయి కనిపిస్తుంది ఈ క్రమంలోనే తనకు నిజం చెప్పాలని భావించిన కార్తీక్ తన చేతులని పట్టుకుని మోనిత సహజ గర్భం అంటుంది కానీ నేను ఈ తప్పు పని చేయలేదు నన్ను నమ్ము బ్రతిమాలాడు.
కార్తీక్ ఇలా చెప్పడంతో దీప ఎంతో కోపంగా చూస్తుంది. తన చూపులకు భయపడిన కార్తీక్ అదంతా నమ్మకు నేను చెప్పేది నిజమే అంటూ బ్రతిమాలుతూ ఉండగా దీప డాక్టర్ బాబు అని పిలవడంతో వెంటనే కలలో నుంచి బయటకు వచ్చిన కార్తీక్ ఇదంతా కల అనుకుంటూ వెళ్తాడు.
ఇక దీప ఎంతో సంతోషంలో ఉంటూ అందరి చేత టపాకాయలు కాల్పిస్తుంది. ఇలా అందరూ టపాకాయలు కాలుస్తున్న సమయంలో సౌందర్యకు మోనిత ఫోన్ చేసి తన కొడుకు బారసాలకు రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ సమయంలో దీప కుటుంబం మొత్తాన్ని తీసుకువస్తానని మాట ఇస్తూ షాక్ ఇస్తుంది. అయితే తర్వాత ఏం జరగబోతోంది వంటలక్క ఏం చేయబోతోంది అనేది తెలియాల్సి ఉంది.