Karthika Deepam: బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ దీప మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు.ఇలా తన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండటంతో సౌందర్య ఆనంద్ రావుతో తనకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని చెబుతుంది.ఇక అదే సమయంలో పిల్లలిద్దరూ వచ్చి వారు కూడా వాకింగ్ వస్తానని చెప్పడంతో సరే వెళ్లి అమ్మకు చెప్పి రండి అంటూ వారిని పంపిస్తుంది.
ఆ సమయంలో కార్తీక్ స్నానం చేసి రాగా దీప కార్తీక్ తల తుడుస్తూ సరదాగా తనని ఆట పట్టిస్తుంది. ఏం టిఫిన్ చేయమంటారు అని దీప అడగడంతో కార్తీక్ ఉప్మా అని చెబుతాడు. అదేంటి డాక్టర్ బాబు మీరు కోపంగా ఉన్నప్పుడే కదా ఉప్మా తింటారు అని అడగడంతో నేను సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఉప్మా తింటానని కార్తీక్ సమాధానం చెప్పగా దీప చేస్తాం అంటూ మరోసారి తన తలను తుడుస్తూ ఎంతో సరదాగా సంతోషంగా గడుపుతారు.ఈ సంఘటన చూసిన పిల్లలు అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మనం కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు అని అనుకుంటారు.
ఇక పిల్లలిద్దరినీ చూసిన కార్తీక్ వారిని లోపలికి పిలుస్తారు. పిల్లలు నానమ్మ తాతయ్యతో కలిసి వాకింగ్ వెళ్తున్నామని చెప్పగా అందుకు ఓకే అన్న కార్తీక్ వెంటనే దీప ఏం టిఫిన్ చేయమంటారు అని అడగగా పిల్లలు కూడా ఉప్మా అని చెప్పడంతో ఆశ్చర్యపోతుంది. మరోవైపు మోనిత ప్రియమణిని రెడీ కమ్మని చెప్పి కార్తీక్ ఇంటికి వెళ్తుంది. ప్రియమణి పదేపదే ప్రశ్నలు వేస్తూ ఉండటం వల్ల మోనిత విసుక్కుంటూ తనకు సమాధానం చెబుతుంది. ఇక కార్తీక్ ఇంటి బయట తనకోసం ఎదురు చూస్తూ ఉండగా లోపల దీప, శ్రావ్య, కార్తీక్, ఆదిత్య లకు టిఫిన్ వడ్డిస్తుంటారు. అదే సమయంలో దీప తండ్రి మురళీకృష్ణ లోపలికి వెళ్లి దీపను పక్కకు పిలిచి మోనిత వచ్చిన విషయం చెప్పడంతో అందరూ సీరియస్ అవుతారు.
ఇక దీప కార్తీక్ బస్తీలో క్యాంపు ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్తారు. అక్కడ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి చికిత్స చేస్తుండడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. తరువాత ఎపిసోడ్లో మోనిత అక్కడికి వెళ్లి కార్తీక్ ను నిలదీయడంతో మోనిత గురించి దీప అక్కడ వారికి చెప్పడంతో బస్తీవాసులు తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై దాడికి దిగారు.