Karthik Subbaraj : సౌత్ ఇండియా లో యూత్ ఆడియన్స్ బాగా ఇష్టపడే దర్శకులలో ఒకరు కార్తీక్ సుబ్బరాజ్. 2012 వ సంవత్సరంలో విడుదలైన ‘పిజ్జా’ చిత్రంతో ఈయన డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ డైరెక్టర్ కి మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘జిగర్తాండా’, ‘ఇరైవి’, ‘పేట’, ‘మహాన్’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ, టేకింగ్ కానీ చాలా డిఫరెంట్ స్టైల్ లో ఉంటాయి. అందుకే యూత్ ఆడియన్స్ ఆ డైరెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన మొట్టమొదటిసారి దర్శకత్వం కి దూరంగా ఉంటూ, కేవలం స్టోరీ ని అందించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. వాస్తవానికి ఈ చిత్రం ఆయన తమిళ హీరో విజయ్ తో, తన స్వీయ దర్శకత్వం లో తీయాలని అనుకున్నాడు.
కానీ అది జరగలేదు, దీంతో శంకర్ కి ఈ స్టోరీ బాగా నచ్చడంతో తనకి ఇచ్చేయాల్సిందిగా కోరాడు. అనంతరం ఆయన రామ్ చరణ్ తో చర్చలు జరిపి ఈ సినిమాని తెరమీదకు తీసుకొచ్చాడు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టోరీ పరంగా ఈ చిత్రం చాలా బలంగా ఉంది కానీ, డైరెక్టర్ శంకర్ దానిని డీల్ చేసిన విధానం అసలు బాగాలేదు. స్క్రీన్ ప్లే లో చాలా లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నాయి. కానీ సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. అదొక్కటే ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్. నెగటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు భారీగా వస్తున్నాయి అంటే అందుకు కారణం ఇదే. ఈరోజు లేదా రేపటితో ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటనుంది.
స్టార్ హీరోలకు వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అధిగమించడం ఎంత పెద్ద టార్గెట్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాప్ టాక్ తో ఆ టార్గెట్ ని మూడు రోజుల్లో రాబట్టింది అంటే సాధారణమైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి కథ ని ఇచ్చినందుకు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాత దిల్ రాజు వద్ద నుండి తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాలా పది కోట్ల రూపాయిలు. పాపం దిల్ రాజు ఈ సినిమా కోసం ఎంత భారీగా ఖర్చు చేశాడు అనడానికి నిదర్శనం ఇదే. ఫుల్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే కచ్చితంగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. అది ఈ సినిమాకి దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 300 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.