Shetty Heroines: శిల్పా శెట్టి, షమితా శెట్టి, అనుష్క శెట్టి, కృతి శెట్టి, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టి, తాజాగా సినీ శెట్టి.. పేర్లు మాత్రమే వేరు. అందంలో ఒకరిని మించి ఒకరు. అందుకే శెట్టి అని ఉంటే చాలు అన్ని ఉడ్ లు ఆవో అంటూ ఆఫర్ లు ఇస్తున్నాయి. తాజాగా సినీ శెట్టి అనే యువతి మిస్ ఫెమినా కిరీటం గెలుచుకోవడంతో మరో అందం తెర పైకి వచ్చింది.

అందాలలో మహోదయం
శిల్పా శెట్టి పొడుగు కాళ్ళ సుందరిగా పేరు గడించింది. 90వ దశకంలో బాలీవుడ్ ను ఏలింది. తెలుగులోనూ మెరిసింది. ఏకంగా బిగ్ బాస్ టైటిల్ కొట్టేసింది. ఆమె చెల్లి. షమితా శెట్టి కూడా అడపా దడపా మెరిసింది. ఇక జేజమ్మ అనుష్క శెట్టి నాగార్జున సూపర్ తో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. చిరంజీవి నుంచి రవితేజ దాకా అందరితో ఆడిపాడింది. అరుంధతీ, బాహుబలి, భాగమతి సినిమాలతో గేమ్ చేంజర్ అని పించుకుంది. “సైజ్ జీరో” సినిమాకు బరువు పెరిగి సినిమా కోసం ఏదైనా నా చేయగలను అనే సంకేతాలు ఇచ్చింది. కోలీవుడ్,శాండల్ ఉడ్ లో లెక్కకు మిక్కిలి సినిమాలు చేసింది.
Also Read: Meera Jasmine: ప్యాంట్ విప్పేసిన మీరా జాస్మిన్.. అందాల అరాచకానికి తెరలేపింది !

కృతి శెట్టి.. ఏ ముహూర్తాన ఉప్పెన సినిమా చేసిందో గానీ.. టాలీవుడ్ బేబమ్మ గా స్థిర పడింది. మోస్ట్ వాటెండ్ హీరోయిన్ అయింది. ఉప్పెన, బంగార్రాజు, ఆ ఆమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం లో నటించింది. చేతిలో రవితేజ, నాగ చైతన్య, తమిళ సూర్య సినిమాలు ఉన్నాయి. డ్యాన్స్ ఇరగ దీస్తూ ఉండటం,చిన్న వయస్సు, దానికి తోడు వావ్ అనిపించే అందం కావడంతో మరో పదేళ్ల వరకు ఈమె కెరీర్ కు ఎటువంటి డోకా లేదు.

డీజే టిల్లు లో రాధిక పాత్రను ఎవరైనా మరచిపోతారా? అంతలా ఇంఫాక్ట్ చూపింది నేహా శెట్టి. 2015 లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్ గా నిలిచింది. అదే సమయంలో శశాంక్ దర్శకత్వంలో శాండల్ ఉడ్ బ్లాక్ బస్టర్ ముంగారమలై-2 లో నటించింది. టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఫోకస్ పడటంతో పూరీ ఆకాష్ సరసన మెహబూబా లో మెరిసింది. అప్పట్లో లావుగా ఉంది అని కామెంట్స్ రావడంతో సన్న జాజి లాగా మారింది. తర్వాత సందీప్ కిషన్ సరసన గల్లీ రౌడీ సినిమా లో నటించింది. అది యావరేజ్ గా అడింది. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డతో చేసిన డీజే టిల్లు నేహా శెట్టిని ఎక్కడికో తీసుకుపోయింది. ఆ సినిమాలో చేసిన రాధిక పాత్ర ఆమె పేరుగా స్థిరపడిపోయిందంటే ఎంత ఇంపాక్ట్ చెప్పిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక టాలీవుడ్కు దొరికిన మరో అందం శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఇటీవల వచ్చిన పెళ్లి సందD సినిమాలో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ శ్రీకాంత్ సరసన మెరిసింది. సినిమా కూడా మంచిగానే ఆడటంతో భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రవితేజ సినిమాలో ఆడి పాడబోతోంది. తాజాగా సినీ శెట్టి అనే యువతి సెమినా మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. ఆమె కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఆఫర్లే ఆఫర్లు
పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టు.. మొన్నటిదాకా బాలీవుడ్ భామలపై ఆసక్తి చెప్పిన తెలుగు హీరోలు.. ఇప్పుడు కన్నడ భామలపై మనసు పడ్డారు. రష్మిక మందన, శ్రీ లీల, శ్రద్ధ శ్రీనాథ్, నభా నటేష్, వర్ష బొల్లమ్మ వంటి కథానాయికలు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. ఇందులో రష్మిక అయితే నేషనల్ క్రష్మిక అయింది. టాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని సిని రంగాల్లో తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్టు ప్రస్తుతం వీరికి క్రేజీ ఉండడంతో భారీగానే డిమాండ్ చేస్తున్నారు. కుల తక్కువ ఒక సినిమాకు 20 నుంచి కోటి రూపాయలు దాకా వసూలు చేస్తున్నారు. రానుపోను ఖర్చులు, హోటల్లో బస, అసిస్టెంట్ల జీతాలు ఇందుకు మినహాయింపు. అన్నట్టు కన్నడ అంటేనే గంధం. ఆ గంధమే ఇప్పుడు అన్నీ ఉడ్ లకు అందం.
Also Read:Mahesh Babu: విడుదల కాకుండా ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే