https://oktelugu.com/

Karhika Deepam:  ఫోటో ఫ్రేమ్ తో సౌందర్య వాళ్లకు షాక్ ఇచ్చిన మోనిత.. సౌందర్యపై మండిపడ్డ ఆదిత్య!

Karhika Deepam:  బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు కార్తీక్.. హిమ, సౌర్యలతో మాట్లాడుతాడు. హిమ స్కూల్ కి వెళ్దామని మారం చేయడంతో కార్తీక్ ఇప్పుడే వద్దని తర్వాత వెళ్ళమని అంటాడు. పండుగకి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసరికి సౌర్య ఎక్కడికి వద్దని ఇక్కడే ఉందామని అంటుంది. అప్పుడే దీప వస్తుంది. దిగులుగా ఉంటుంది. హిమ, సౌర్య కాసేపు స్కూల్ గురించి మాట్లాడుతారు. సంక్రాంతికి కొత్తబట్టలు కావాలని పిల్లలు అడుగుతారు. దీప […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2021 / 05:34 PM IST
    Follow us on

    Karhika Deepam:  బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు కార్తీక్.. హిమ, సౌర్యలతో మాట్లాడుతాడు. హిమ స్కూల్ కి వెళ్దామని మారం చేయడంతో కార్తీక్ ఇప్పుడే వద్దని తర్వాత వెళ్ళమని అంటాడు. పండుగకి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసరికి సౌర్య ఎక్కడికి వద్దని ఇక్కడే ఉందామని అంటుంది. అప్పుడే దీప వస్తుంది. దిగులుగా ఉంటుంది. హిమ, సౌర్య కాసేపు స్కూల్ గురించి మాట్లాడుతారు. సంక్రాంతికి కొత్తబట్టలు కావాలని పిల్లలు అడుగుతారు. దీప వాళ్లకు నచ్చజెప్పి పంపిస్తుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు.

    Karhika Deepam

    రుద్రాణి స్కూల్లో పని లేకుండా చేసిందని.. తనను నేను కొట్టినందుకే నన్ను ఇలా చేసిందని అంటుంది దీప. నువ్వే కాదు నేను కూడా వాళ్ళ మనుషులను కొట్టాను అని కార్తీక్ అంటాడు. వెంటనే దీప షాక్ అవుతుంది. ఇక కార్తీక్ బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మోనిత సౌందర్య వాళ్ల ఇంట్లో దోష నివారణ పూజ సమయంలో దిగిన ఫోటోను పెద్దగా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి సౌందర్య వాళ్లకు చూపిస్తుంది. ఆ ఫోటో ని చూసి వాళ్లు అందరు షాక్ అవుతారు. ప్రియమణి నోటనుండి మాటే బయటికి రాదు.

    Also Read: అక్కడ మోనిత.. ఇక్కడ రుద్రాణి.. ఇక ఈ కుటుంబానికి సంతోషాలే లేవా?

    జంట బాగుంది కదా మా జంటను దీవించండి అని ఓవరాక్షన్ చేస్తుంది మోనిత. ఇక ఆదిత్య కోపంతో రగిలిపోతాడు. ఆ ఫోటోని తీసుకుని గోడకు తగిలిస్తుంది. ఆదిత్య కోపంతో ఫోటో పగలగొట్టాలని చూస్తాడు. ఇక మోనిత ఆ ఫోటో తీస్తే వీధిలో ఫ్లెక్సీ లు పెడతాను అని బెదిరిస్తుంది. మోనిత ఓవర్ యాక్టింగ్ చూసి సౌందర్య అరుస్తుంది. అయినా కూడా మోనిత ఇంకా ఎక్కువ చేస్తుంది. ఫోటో తీస్తే మాత్రం మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది.

    కోటేష్, శ్రీవల్లి బిడ్డను తీసుకోని తాము ఉండే చోటికి వచ్చి తమ వస్తువులు లేకపోయేసరికి బాధపడుతారు. అప్పుడే కార్తీక్ వచ్చి వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్లగా దీప వాళ్లను సంతోషంగా ఆహ్వానిస్తుంది. మర్యాదలు చేస్తుంది. ఇక రుద్రాణి మనిషి చూసి రుద్రాణికి చెప్పాలనుకుంటాడు. సౌందర్య ఒంటరిగా ఆలోచిస్తుంది. ఆదిత్య వచ్చి సౌందర్యపై అరుస్తాడు. ఇదంతా నీ వల్లే జరిగిందంటూ బాధపడుతాడు. దోష నివారణ పూజ చేయించి తప్పు చేసావని అంటాడు. ఇక దీప బాబును ఎత్తుకోగా రోజులా బిడ్డలా లేడే అని అనేసరికి షాక్ కోటేష్ షాక్ అవుతాడు.

    Also Read: రుద్రాణి చెంప పగలకొట్టిన వంటలక్క.. దీప ఒడిలోకి చేరుకున్న మోనిత బిడ్డ!