Kapolla Intikada Song: ఇటీవల సినిమాల్లోని సాంగ్స్ కు క్రేజ్ తగ్గి ఫోక్ సాంగ్స్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో చాలా మంది తక్కువ ఖర్చులో పాటలను తయారు చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అచ్చమైన పల్లె సంస్కృతి, సహజమైన భావాలు, స్థానిక పదజాలంతో రూపొందే ఈ పాటలు అందరి హృదయాన్ని తాకుతున్నాయి. ఓ వైపు ఫాస్ట్ జనరేషన్ తయారవుతున్న కాలంలో ఫోక్ సాంగ్స్ కు ఆదరణ పెరుగుతుండడం విశేషం. ఇందులో భాగంగా ఓ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. ‘కాపోళ్ల ఇంటికాడ’అనే టైటిల్ తో ప్రారంభమయ్యే ఈ సాంగ్ లక్షల వ్యూస్ తో దూసుకు వెళ్తోంది. ఈ సాంగ్ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం యూట్యూబ్ లో జానపద హవా సాగుతోంది. ఇందులో భాగంగా ‘కాపోళ్ల ఇంటికాడ’ సాంగ్ పై ఎక్కువగా ఆసక్తి పెరుగుతోంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో భారీ స్పందన పొందుతోంది. ఈ పాటలో ఫోక్ డాన్సర్ నాగ దుర్గ తన ఎనర్జిటిక్ డాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే స్టెప్స్, హావభావాలు ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆమె డాన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ పాటకు మదీన్ షేక్ సంగీతం అందించగా, శ్రీలత సాహిత్యాన్ని రచించింది. పల్లెటూరి పదాలతో సింపుల్‌గా, అందరికీ అర్థమయ్యేలా రాసిన ఈ లిరిక్స్ పాటకు మరింత బలం చేకూర్చాయి. అలాగే గాయకురాలు కుమర వాగ్దేవి తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోసింది. ఆమె వాయిస్‌లో ఉన్న గ్రామీణ తీయదనం పాటను మరింత ఆకట్టుకునేలా చేసింది.
ఈ సాంగ్ ఇప్పటికే YouTube లో లక్షలాది వ్యూస్ సాధిస్తూ వైరల్ అవుతోంది. అదే విధంగా Instagram లోనూ ఈ పాటకు రీల్స్ రూపంలో భారీ స్పందన వస్తోంది. చాలా మంది యూజర్లు ఈ పాటకు డాన్స్ చేస్తూ వీడియోలు షేర్ చేయడంతో మరింత పాపులారిటీ పెరుగుతోంది. ‘కాపోళ్ల ఇంటికాడ’ సాంగ్ ఫోక్ మ్యూజిక్‌కు ఉన్న అసలు క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఈ పాట డీజే వెర్షన్ తో మరో వీడియోను తయారు చేశారు. అంతేకాకుండా దీనిని పార్ట్ లుగా విభజించి యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. పంక్షన్లలో, ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ సాంగ్ తో ఎంజాయ్ చేస్తున్నారు.