Kantara Collections: ఈ మధ్య కాలం లో పాన్ ఇండియా లెవెల్ లో చరిత్ర సృష్టించిన సినిమాలలో ఒకటి ‘కాంతారా’..కన్నడ చలన చిత్ర పరిశ్రమ ని గర్వంగా తలా ఎత్తుకునేలా చేసిన చిత్రం ఇది..కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తారు..హీరో స్టార్ స్టేటస్ తో సంబంధమే లేదు అని నిరూపించిన సినిమాలలో ఒకటి ఈ చిత్రం..50 రోజులకు చేరువ అవుతున్న ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ నుండే 30 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి ఇప్పటికి స్టడీ కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు కాంతారా దాటికి కొత్త సినిమాలు కూడా తట్టుకోలేకపోతున్నాను..నైజం వంటి ప్రాంతాలలో ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వసూళ్లనే దాటేసింది అంటే ఇది ఎలాంటి బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఇక హిందీ లో అయితే చెప్పనక్కర్లేదు..ఇప్పటి వరుకు సుమారు 70 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.
రోజు రోజుకి అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకి దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన రికార్డు ని కూడా చేదించేసింది..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచినా చిత్రం పుష్ప..అప్పటి వరుకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరో గా కొనసాగుతున్న అల్లు అర్జున్ , ఈ చిత్రం తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు..సుమారు 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ ని ఇప్పుడు కాంతారా అన్ని వెర్షన్స్ కి కలిపి దాటేసింది..40 రోజులకు గాను ఈ చిత్రం 355 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..OTT లో విడుదల అవ్వడానికి ఇంకా పది రోజుల సమయం ఉన్నందున మరో 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

హిందీ లో పుష్ప సినిమా దాదాపుగా 107 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..కాంతారా చిత్రం ఇప్పటి వరుకు ఇక్కడ 70 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఈ వీకెండ్ కూడా పెద్దగా సినిమాలు ఏమి లేకపోవడం తో కచ్చితంగా వంద కోట్ల రూపాయిల మార్కుని దాటేసి ఫుల్ రన్ లో పుష్ప కలెక్షన్స్ ని హిందీ లో కూడా అధిగమించే ఛాన్స్ ఉన్నట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.