Kantara Chapter 1 Box Office Collection: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి పెద్ద సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కారణమేంటంటే పాన్ ఇండియాలో ప్రస్తుతం చాలా సినిమాలు గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఇక్కడ చాలా పెద్ద సక్సెస్ ను అందుకుంది…ఈ సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ వన్ కి చాలా మంచి బజ్ వచ్చింది. ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి…ఈ మూవీ ప్రీక్వెల్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక దానికి తగ్గట్టుగానే మొదటి షో తోనే సినిమా సక్సెస్ ఫుల్ టాక్ సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 700 కోట్ల వరకు ఒక కలెక్షన్స్ ను రాబట్టినప్పటికి తెలుగులో మాత్రం ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమాకి తెలుగులో వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే 85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఇప్పటివరకు ఈ సినిమాకి 85 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 115 కోలెక్షన్స్ ని రాబట్టింది. అయినప్పటికీ ఈ సినిమా బ్రేక్ అవ్వాలంటే ఇంకా 21 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ లాభాలు రావాలంటే ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ ను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది… చూడాలి మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేకపోతే దీపావళికి రిలీజ్ అయిన డ్యూడ్ సినిమాతో పోటీ పడలేక ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిపోతాయా అనేది తెలియాల్సి ఉంది…
బ్రేక్ ఈవెన్ అయి తెలుగులో రిషబ్ శెట్టి మార్కెట్ పెరిగీతే మాత్రం ఆయనతో డైరెక్ట్ గా తెలుగు ప్రొడ్యూసర్లు సైతం సినిమాని చేసే అవకాశాలు ఉన్నాయి… చూడాలి మరి కాంతార చాప్టర్ 1 ఏ లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు రాబడుతుందా? లేదా అనేది…