Kantara Chapter 1 Advance Bookings: పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించిన సినిమాల్లో ఒకటైన ‘కాంతారా’ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతారా : చాప్టర్ 1′(Kantara : Chapter 1) చిత్రం నేడు ప్రీమియర్ షోస్ ద్వారా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తగా విడుదల కాబోతుంది. ముందుగా ప్రీమియర్ షోస్ ని నేడు వెయ్యాలా వద్దా అనే సందిగ్ధం లో ఉన్నారు బయ్యర్స్. ముందుగా ప్రీమియర్ షోస్ వెయ్యడానికే నిర్ణయం తీసుకొని అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. కానీ మళ్లీ బుకింగ్స్ ని తొలగించారు, తెలంగాణ లో అయితే ప్రీమియర్ షోస్ వేయడం లేదు కానీ, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా నేడు రాత్రి ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి కానీ, ఏ ప్రాంతం లో కూడా ప్రీమియర్ షోస్ మరియు మొదటి రోజు కి అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయి లో జరగలేదు. ఒక సూపర్ హిట్ సీక్వెల్ చిత్రానికి ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం గమనార్హం.
ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి కేవలం 28 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే జరిగింది. ఈ ఏడాది విడుదలైన పాన్ ఇండియా చిత్రాలన్నిటికంటే చాలా తక్కువ. ఇక ఓవర్సీస్ అయితే దారుణం అనే చెప్పాలి. నార్త్ అమెరికా మొత్తం కలుపుకొని కేవలం మూడు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే జరిగింది. రేపు టాక్ రాకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం 9 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే ప్రీమియర్ షోస్ నుండి కనీసం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ అయినా రాబట్టాలి. కానీ కనీసం 1 మిలియన్ డాలర్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. టాక్ పాజిటివ్ గా వస్తే అన్ని వెర్షన్స్ నుండి భారీ వసూళ్లు వస్తాయి.
లేదంటే 9 మిలియన్ డాలర్లు బూడిద పోసిన పన్నీరే అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రానికి కూడా ఈ రేంజ్ బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడుంది. మరి టాక్ వస్తుందో లేదో కొద్దీ గంటల్లోనే తేలనుంది. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ ఎలా ఉన్నప్పటికీ, కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. KGF సిరీస్ తర్వాత ఈ చిత్రానికే ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.