Kantara Box Office Collections: కొత్త కథ.. కొత్త దర్శకుడు.. అయినా పర్వాలేదు.. సినిమా కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అని నిరూపిస్తోంది ‘కాంతార’. కన్నడ ఇండస్ట్రీలో వారం కిందట విడుదలయిన ఈమూవీ ఒక్క వారంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పటి వరకు ఈ మూవీ 103 కోట్లు సాధించి మరిన్ని వసూళ్లు కొల్లగొట్టేందుకు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. కన్నడిగులు ఇదివరకే తీసిన కేజీఎఫ్ పాన్ ఇండియా లెవల్లో షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కాంతార’ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ మూవీకి ఇప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ నుంచే 100 కోట్లు సాధించింది. ఇటీవల తెలుగులో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అటు బాలీవుడ్ లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. దీంతో అసలు కథ ఇప్పుడు మైదలైందని అనుకుంటున్నారు.

ఇటీవల సౌత్ సినిమాల హవా సాగుతోంది. కేజీఎఫ్ నుంచి మొన్నటి కార్తీకేయ 2 వరకు అన్నీ పాన్ ఇండియా సినిమాలే అని చెప్పవచ్చు. కార్తీకేయ తెలుగులో రిలీజ్ అయినా హిందీలో వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ‘కాంతార’ దానిని బీట్ చేస్తుందని అంటున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ పార్ట్ 1, 2లు హిందీలో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఎప్పుడో ఓసారి ఇలాంటి సినిమాలు వస్తాయి.. అని అనుకున్నారు.కానీ ఆ సినిమా జోష్ మరువకముందే కన్నడిగులు ‘కాంతార’తో మరో సంచలనం సృష్టించారు.
మొన్నటి వరకు కార్తీకేయ 2 మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరి సౌత్ సినిమా సత్తా చూపించింది. ఇప్పుడు ‘కాంతార’ కార్తీకేయను బీట్ చేసినా.. చేయకపోయినా ఆ రేంజ్ కు వెళితే సౌత్ సినిమాల జోరు పెరిగినట్లే. ఇప్పటికే బాలీవుడ్లో 100 కోట్లకు చేరిన సినిమాలు మచ్చుకైనా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు ఇలా దూసుకెళ్లడం చూసి బీ టౌన్ షాక్ తింటోంది. అయితే కన్నడలో అనుకున్న టార్గెట్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెలుగు, హిందీలోనూ ఇదే హవా కొనసాగిస్తే ఇక ‘కాంతార’కు తిరుగుండదని అంటున్నారు.

దీంతో కన్నడ ఇండస్ట్రీ సంబరాలు చేసుకోవాల్సిందే. ఇప్పటికే మాస్ ఎఫెక్ట్ సినిమాలు తీసి సంచలనాలు సృష్టిస్తున్న శాండిల్ వుడ్ మరిన్ని కొత్త కథలతో సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారట. అటు తమిళంలోనూ ప్రయోగాత్మక సినిమాలు తీస్తున్నారు. తెలుగులోనూ పుష్ప 2 రెడీ అవుతోంది. దీంతో రాను రాను సౌత్ సినిమాల హవానే సాగనుంది. మరి బీ టౌన్ పరిస్థితి రాను రాను ఎలా ఉంటుందో చూడాలి.