Kantara 2 Box Office Collections: పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతారా 2′(Kantara 2 Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ ట్రెండ్ ని చూస్తుంటే కర్ణాటక లో తప్ప, మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టతరమైన టాస్క్ అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అనే పదాన్ని మర్చిపోవచ్చు అంటున్నారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాలుగు రోజుల్లో రిటర్న్ జీఎస్టీ తో కలిపి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ నెంబర్ ని అందుకోవాలంటే ఇంకా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి.
నేడు ఈ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తే అంత మొత్తం వసూళ్లను రాబట్టడం కష్టమేమో అని అనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఈ చిత్రం 11 రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ కంటే తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ని నమోదు చేసుకుంది. ఇదే ట్రేడ్ ని షాక్ కి గురి చేస్తున్న విషయం. మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం ఎందుకు ఇలా అండర్ పెర్ఫర్మ్ చేస్తుందో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఉన్నంత పాజిటివ్ టాక్, బయట జనాల్లో లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి నాలుగు రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో వివరంగా చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రం నాల్గవ రోజున 83 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది సెన్సేషనల్ అనే చెప్పాలి.
ఓవరాల్ గా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 310 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క కర్ణరక ప్రాంతం నుండే ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి ఏ రేంజ్ ఓపెనింగ్ వచ్చింది అనేది. నేడు కూడా ఈ చిత్రానికి కర్ణాటక ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. ఇక తెలుగు రాష్ట్రల విషయానికి వస్తే నిన్న ఒక్క రోజునే ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.