Kannappa Movie Worldwide Release Date: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి సుమారుగా 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ ని ఖర్చు చేసి ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కోసం ఆయన డేట్స్ అడిగిన వెంటనే ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar),మోహన్ లాల్(Mohanlal) వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇచ్చేసారు. వీరిలో అక్షయ్ కుమార్ తప్ప ప్రభాస్, మోహన్ లాల్ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి షూటింగ్ చేసి వెళ్లారు. మంచు విష్ణు కి అన్నీ అలా కలిసొచ్చాయి. అలా ఎన్నో ఆశలతో, ఎన్నో కష్టాలను అనుభవించి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని 5400 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారట. వాటిల్లో ఐమాక్స్, 4DX మరియు స్క్రీన్ X ఫార్మట్స్ కూడా ఉన్నట్టు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను నేడు పూర్తి చేశారట. దాదాపుగా 12 నిమిషాల ఫుటేజీ ని తొలగించిన తర్వాత 183 నిమిషాల రన్ టైం మిగిలిందట. అంటే సినిమా పూర్తి నిడివి 3 గంటల 15 నిమిషాలట. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. రీసెంట్ గా విడుదలైన ‘కుబేర’ చిత్రం కూడా మూడు గంటల నిడివి ఉన్న సినిమానే. కానీ కంటెంట్ లో దమ్ము ఉండడం వల్ల ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ‘కన్నప్ప’ చిత్రం కూడా అదే విధంగా హిట్ అవుతుందని బలమైన నమ్మకంతో చెప్తుంది మూవీ టీం. ఇక సినిమా ఔట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందట. ఎమోషన్స్ బాగా పండాయట. గ్రాఫిక్స్ వర్క్, కెమెరా వర్క్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు.
ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందట. ప్రభాస్ ఎంట్రీ , ఆయన చేసే ఫైట్స్ అభిమానులకు కనుల విందుగా ఉంటుందట. అతిథి పాత్రలు ఎదో సినిమా కోసం పెట్టినట్టు కాకుండా, చాలా సహజ సిద్ధంగా ఉన్నాయట. ఓవరాల్ గా ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని, ఇలాంటి సినిమాలు నేటి తరం ప్రేక్షకులు కచ్చితంగా చూడాలి అంటూ చెప్పుకొచ్చారట సెన్సార్ సభ్యులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి మాత్రం బయ్యర్స్ ముందుకొచ్చే సాహసం చేయలేదు. దీంతో మంచు విష్ణు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సొంతంగా విడుదల చేసుకుంటున్నాడు. ఇంత రిస్క్ ఈమధ్య కాలం లో ఏ నిర్మాత కూడా తీసుకోలేదు. కానీ ప్రతీ చోట టాప్ బయ్యర్స్ నుండే విడుదల చేయిస్తున్నాడు. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి.