Homeఎంటర్టైన్మెంట్Kannappa : చిక్కుల్లో కన్నప్ప మూవీ.. హార్డ్ డ్రైవ్ తో యువతి పరార్!

Kannappa : చిక్కుల్లో కన్నప్ప మూవీ.. హార్డ్ డ్రైవ్ తో యువతి పరార్!

Kannappa : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీ సమస్యల్లో చిక్కుకుంది. ఆ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ తో యువతి పరారైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విడుదల మరింత ఆలస్యం అవుతుందా అనే సందేహం కలుగుతుంది.

కన్నప్ప మూవీ విడుదల ఇప్పటికే ఆలస్యమైంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ విడుదలపై స్పష్టత లేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. వివరాల్లోకి వెళితే.. కన్నప్ప మూవీకి సంబంధించిన సున్నితమైన సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ అపహరణకు గురైనట్లు తెలుస్తుంది. హార్డ్ డిస్క్ తో కన్నప్ప ఆఫీస్ లో పని చేస్తున్న యువతి పరారైనట్లు సమాచారం.

కన్నప్ప మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ ముంబైకి చెందిన ఓ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థ కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ ని ఫిలింనగర్ లో గల కన్నప్ప మూవీ ఆఫీస్ కి కొరియర్ లో పంపింది. హార్డ్ డిస్క్ ని ఆఫీస్ బాయ్ రఘు ఈ నెల 25న తీసుకున్నాడు. అదే రోజు హార్డ్ డిస్క్ ని చరిత అనే యువతికి ఇచ్చాడు. ఆఫీస్ సిబ్బందిలో ఒకరైన క్రాంతి ఆఫీస్ బాయ్ రఘును హార్డ్ డిస్క్ ఎక్కడని అడగగా, చరితకు ఇచ్చానని చెప్పాడు. చరిత ఆఫీస్ లో లేకపోవడంతో పాటు ఆమె సమాచారం తెలియలేదు. దాంతో చరిత హార్డ్ డిస్క్ తో పరారైందని కన్నప్ప నిర్మాతలు భావిస్తున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?

కొందరి డైరెక్షన్ లో చరిత ఈ పని చేసిందని కన్నప్ప సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. హార్డ్ డిస్క్ లో ఉన్న సున్నితమైన సమాచారం లీక్ చేయడం ద్వారా తమ సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని అవా ఫిలిమ్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయడం కన్నప్ప చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తో పాటు పలువురు స్టార్ క్యాస్ట్ కన్నప్ప లో భాగం అయ్యారు.

కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నప్ప మూవీలో మంచు విష్ణు శివ భక్తుడి పాత్ర చేస్తున్నాడు. కన్నప్ప ప్రమోషన్స్ లో మంచు విష్ణు విరివిగా పాల్గొంటున్నాడు. వివిధ మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కన్నప్ప చిత్రానికి స్క్రీన్ ప్లే తానే సమకూర్చాను అంటున్న మంచు విష్ణు, చివరి 50 నిమిషాలు కన్నప్ప అద్భుతంగా ఉంటుందని అన్నారు.

Exit mobile version