Kannappa Industry Hit Poster: సినీ నిర్మాతలు తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎన్నో రకాల ప్రమోషన్స్ చేస్తుంటారు. అందులో ఒకటి కలెక్షన్స్ పోస్టర్స్. వచ్చిన దానికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు పోస్టర్ మీద కొట్టించి విడుదల చేయడం అనేది మొదటి నుండి మన టాలీవుడ్ లో ఆనవాయితీగా ఉంది. ప్రేక్షకులు ఆ పోస్టర్స్ ని చూసి ‘అబ్బో..ఇంత కలెక్షన్స్ వచ్చాయా..అయితే కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి’ అని అనుకునే ఆడియన్స్ ఉంటారు. వాళ్ళ కోసమే ఇలాంటి పోస్టర్స్ కొట్టిస్తారు. ఈమధ్య కాలం లో కొన్ని సినిమాల కలెక్షన్స్ పోస్టర్స్ ఏ రేంజ్ కామెడీ అనిపించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మామూలు హీరోలు,నిర్మాతలే అతిశయోక్తి గా అనిపించే పోస్టర్స్ ని విడుదల చేస్తుంటే,ఇక అతిశయోక్తి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా అనిపించే మంచు ఫ్యామిలీ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది చెప్పండి.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
నిన్న మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎదో ప్రయత్నం చేసాడు,బాగానే ఉంది అనే టాక్ వచ్చింది. ప్రభాస్, అక్షయ్ కుమార్,మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఈ చిత్రం లో ఉండడం, దానికి తోడు ట్రైలర్,పాటలు కూడా క్లిక్ అవ్వడం తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వరకు పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి. ఈ మాత్రానికే ‘కన్నప్ప’ టీం ‘ఇండస్ట్రీ హిట్’ అంటూ ఒక పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. నన్ను ట్రోల్ చేస్తే జైలు లో వెయ్యిస్తా అంటూ చెప్పుకొచ్చే మంచు విష్ణు,ఇలాంటి పోస్టర్స్ ని విడుదల చేస్తే ట్రోల్ చేయకుండా ఇంకేమి చేస్తారు చెప్పండి?. నేను ఏమి చేసినా నన్ను ఎవ్వరూ ఏమి అనకూడదు అంటే,ఇది ప్రజాస్వామ్య దేశమా?, లేకపోతే ఇంకేమైనా నా ? అనేది మంచు విష్ణు అర్థం చేసుకోవాలి.
‘ఇండస్ట్రీ హిట్’ అంటే అర్థం ఏంటో తెలుసా..?, ఒక సినిమా ఇండస్ట్రీ లో కలెక్షన్స్ పరంగా టాప్ 1 లో ఉన్న చిత్రాన్ని అధిగమించితే ఇండస్ట్రీ హిట్ అని పిలుస్తారు. మన టాలీవుడ్ ప్రస్తుతానికి ఇండస్ట్రీ హిట్ అంటే ‘బాహుబలి 2’ నే. ఆ తర్వాత పుష్ప 2 , #RRR , కల్కి వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాయి. బాహుబలి 2 చిత్రానికి 1800 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రాన్ని మంచు విష్ణు ఇండస్ట్రీ హిట్ అంటున్నాడు కాబట్టి, ఈ సినిమా మొదటి రోజే 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందా?, మహేష్,రాజమౌళి సినిమాకి కూడా మొదటి రోజు అంత వసూళ్లు రావడం అసాధ్యం కదా. బహుశా అవతార్ మొదటి రోజు వసూళ్లు కూడా ఈ రేంజ్ లో ఉండదేమో. మరి మంచు విష్ణు దృష్టిలో ఇండస్ట్రీ హిట్ అంటే ఏంటో ఆయన నోటి ద్వారానే వినాలి.