Kannada Superstar: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భిన్నమైన హీరో. నిజానికి ఇరవై ఏళ్ల క్రితమే సౌత్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఇప్పుడంటే కన్నడలో యశ్, సుదీప్ అంటూ కొందరు పాన్ ఇండియా స్టార్లుగా చలామణి అవుతున్నారు గానీ, కన్నడలో మొదటి పాన్ ఇండియా స్టార్ ఉపేంద్రనే. అయితే, ఉపేంద్ర నుంచి మళ్లీ మరో పాన్ ఇండియా సినిమా రాబోతుంది.

ఏది ఏమైనా ఉపేంద్ర కథలు సామాజిక ఉత్తేజాన్ని కలిగిస్తాయి, అలాగే ఉపేంద్ర మాటలు అన్యాయానికి ఎదురు తిరగాలనే ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాయి. నిజానికి ఉపేంద్ర సంప్రదాయ కుటుంబంలో పుట్టినా.. విప్లవ భావాలతోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అందుకే, కన్నడ స్టార్ హీరోగా ఉపేంద్రకి లాంగ్ జర్నీ ఉంది.
Also Read: కలెక్షన్ల మోత మోగిస్తున్న ‘పుష్ప’ !
పైగా నట దర్శక రచయిత నిర్మాతగా కన్నడనాట ఉపేంద్రకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు. ఆ మాటకొస్తే తెలుగు నేల పైనా అంతటి విభిన్నమైన హీరో మరొకరు లేరు. నలుగురు హీరోలు వెళ్తున్న బాట ఆయనకు నచ్చదు. అందుకే, తనదైన పంథాను సృష్టించుకున్నాడు. ఉపేంద్ర పాత్రలు పచ్చిగా ఉంటాయి, డొంక తిరుగుడు ఉండదు, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం.
ఆ విలక్షణమే ఆయనను కన్నడనాట సూపర్ స్టార్ ను చేసింది. ఆయనను కన్నడ ప్రేక్షకులు ‘ఉప్పి’ అంటూ ఆరాధిస్తున్నారు అంటే కారణం.. ఉపేంద్ర హీరో కాదు, ఒక తిరుగుబాటు దారుడు. ఇక ఉపేంద్ర సినిమాల్లో ఉండే మరో ప్రత్యేకత.. మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నం చేయడు. సగటు మనిషి ఆలోచనల్లోని ఒడిదుడుకులను పట్టుకుంటాడు.
స్వార్థం తో నిండిపోయిన సమాజంలోని లోపాలను, వాటి పై విరక్తి చెందిన ఓ ఆవేశపరుడిగా రియాక్ట్ అవుతాడు. అయితే, ఆ ఆవేశంలో ఒక్కోసారి సామాజిక స్పృహ కంటే.. బోల్డ్ నెసే ఎక్కువ ఉంటుంది. దాంతో ఉపేంద్ర విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఈ కన్నడ సూపర్ స్టార్ నుంచి మరో వైవిధ్యమైన పాన్ ఇండియా సినిమా రానుంది.
Also Read: హీరో సత్యదేవ్ “గాడ్సే” సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్