Homeఎంటర్టైన్మెంట్Film Industry: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం... దిగ్గజ నటుడు శివరామ్ మృతి

Film Industry: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం… దిగ్గజ నటుడు శివరామ్ మృతి

Film Industry: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఇటీవలే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కుంగిపోయిన కన్నడ ప్రజలు తాజాగా మరో సినీ ప్రముఖున్ని కోల్పోయారు. కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్ (83) తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడం వల్ల గురువారం, బెంగళూరులోని ఆస్పత్రిలో చేరిన ఆయన… ఈరోజు మరణించారు. ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమవ్వగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెయిన్​లో బ్లీడింగ్​ అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన వయసు కారణంగా సర్జరీ నిర్వహించలేకపోయారని అంటున్నారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్​ను డాక్టర్లు బతికించలేకపోయారు.

kannada senior actor and director sivaram passed away

నటుడు శివరామ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు కన్నడ సినిమాల్లో పనిచేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హాస్య పాత్రలు, సహాయపాత్రలు పోషించారు. 1965 సినిమాలో ‘బేరత జీవా’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు శివరామ్. 90కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తన సోదరుడు ఎస్. రామనాథన్​తో కలిసి పలు సినిమాలను నిర్మించారు. 1972లో ‘హదయ సంగమ’ సినిమాతో నిర్మాతగా తొలి సినిమా రూపొందించారు. అలానే 1985 లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘గిరఫ్తార్’ నిర్మించింది కూడా ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్​హాసన్, రజనీకాంత్ కలిసి నటించడం విశేషం. అలానే 2010-11 ఏడాదికి గాను డాక్టర్.రాజ్​కుమార్ లైఫ్​టైమ్ అచీవ్​మెంట్​ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్​కు బహుకరించింది. అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు కూడా శివరామ్ ను వరించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular