Bigg Boss Kannada: రియాల్టీ షో లల్లో బిగ్ బాస్ కు ప్రత్యేక స్థానముంది. ఎక్కడో ఇంగ్లీష్ దేశంలో పుట్టి.. శిల్పా శెట్టి ఎపిసోడ్ తో ఫేమస్ అయిన బిగ్ బాస్ షో తర్వాతి కాలంలో మన దేశంలో అడుగు పెట్టింది. మొదటగా హిందీలో ఈ షో ప్రారంభమైంది. ఆ తర్వాత మిగతా భాషల కు విస్తరించింది. దాదాపు అన్ని భాషల్లో కొన్ని ఏళ్ల నుంచి విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉంది.ఈ షో పైన ఎన్నో ఆరోపణలు, మరెన్నో వివాదాలు వినిపించినప్పటికీ సీజన్ల కు సీజన్లు పూర్తవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త విజేతలు పుట్టుకొస్తూనే ఉన్నారు. మన తెలుగు నాట మొదట్లో జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని, ఇప్పుడు నాగార్జున ఈ షో ను నడిపిస్తున్నారు. స్టార్ మా గ్రూప్ ఈ షో ను టెలికాస్ట్ చేస్తోంది. ఇటీవల ముగిసిన ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. మన దగ్గర ఏడో సీజన్ పూర్తయింది గాని.. పొరుగున ఉన్న కర్ణాటకలో దాదాపు పదో సీజన్ మరి కొద్ది గంటల్లో పూర్తవనుంది.. పదో సీజన్ కు సంబంధించి కన్నడ కలర్స్ ఛానల్ లో ఈరోజు ఫైనల్ ప్రసారం కానుంది. కన్నడ నటుడు కిచ్చా సుధీప్ హోస్ట్ చేస్తున్న ఈ షో లో పైనల్ లో విజేత ఎవరో అల్ రెడీ ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు. కొన్ని సంవత్సరాలు విజేత ఎవరో చెప్పాలంటూ నిర్వహించిన సర్వేలో ఓ కంటెస్టెంట్ వైపు ప్రేక్షకులు మొగ్గు చూపారు.
కన్నడ కలర్స్ ఛానల్ లో గత 113 రోజులుగా బిగ్ బాస్ కన్నడ పదవ సీజన్ షో టెలికాస్ట్ అవుతోంది. ట్రోఫీ కోసం వినయ్ గౌడ, సంగీత, ప్రతాప్, కార్తీక్ మహేష్, వర్తూర్ సంతోష్ పోటీపడుతున్నారు.. అయితే ఇందులో ఎవరిని విజేత గా ఎంపిక చేసుకుంటారని ప్రఖ్యాత టైమ్స్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో భారీగా నెటిజన్లు పాల్గొన్నారు. ఈ సర్వేలో చాలామంది సంగీత వైపు మొగ్గు చూపించారు. 52% మంది తమ ఓటును సంగీతకు వేశారు. ఎటువంటి అంచనాలు లేకుండా షో లోకి అడుగుపెట్టిన సంగీత.. ఆ తర్వాత తన ఆట తీరుతో షో లో ప్రధాన కంటెస్ట్ గా మారింది. అంతేకాదు ఒపీనియన్ సర్వేలో ప్రేక్షకుల మద్దతు పొందింది. అంతేకాదు ఆమెకు ఓటు వేసిన చాలామంది సీజన్_3 లో శృతి కృష్ణ మాదిరి సంగీత కూడా విజేతగా నిలవాలని కామెంట్లు చేశారు. ఇక వినయ్ గౌడ 24 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. కార్తీక్ మహేష్ 19 శాతం, ప్రతాప్, సంతోష్ 5% ఓట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ఇక మరొక వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రతాప్ విజేతగా నిలిచాడు. ఆ వెబ్ సైట్ తేల్చిన ప్రకారం దాదాపు 40% ఓటు (1,55,922 ఓట్లు) సాధించాడు. తర్వాతి కంటెస్టెంట్ వినయ్ 31 శాతం ఓట్లు సాధించాడు. తర్వాతి కంటెస్టెంట్ సంగీత 12% ఓట్లతో మూడవ స్థానం, 8 శాతం ఓట్లతో సంతోష్, 5 శాతం ఓట్లతో ప్రతాప్ తర్వాత స్థానంలో ఉన్నారు. మొత్తంగా ఈ షోలో ఆరుగురు పోటీ దారులు ఉన్నప్పటికీ.. సంగీత, ప్రతాప్ ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. ఈ షోలో వినయ్ చాలాసార్లు దూకుడుగా వ్యవహరించాడు.. ఇక సంగీత కూడా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ షోలో అడుగు పెట్టింది. ఆ తర్వాత గేమ్ మొత్తం తన వైపు తిప్పుకుంది. సీజన్ 3 లో శృతి కృష్ణ తర్వాత ఇంతవరకు ఏ మహిళా కంటెస్టెంట్ విజేతగా అవతరించలేదు. అయితే ఇప్పుడు సంగీతకు ఆ అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. టాస్క్ లలో రాణించిన కార్తీక్ కూడా ప్రధాన పోటీ దారుల్లో ఒకరని ఒపీనియన్ సర్వేలో పాల్గొన్న నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతాప్ ముక్కుసూటి తనం కూడా తమకు నచ్చిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సంతోష్ కూడా తన టైమింగ్ తో అలరించాడని.. అన్నీ బాగుంటే అతడు కూడా ట్రోఫీ దక్కించుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని నెటిజన్లు అంటున్నారు. ఈ పదవ సీజన్లో ఎవరు విజేతగా నిలుస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.