https://oktelugu.com/

Kangana Ranaut Poonam Pandey: పూనమ్‌ బూతు పై బూతుల హీరోయిన్ ఘాటు ప్రశంసలు !

Kangana Ranaut Poonam Pandey: వివాదాల రాణి ‘కంగనా రనౌత్’ గురించి ఏమి అని చెప్పా లి ? బూతుల రాణి ‘పూనమ్ పాండే’ గురించి ఎంత అని చెప్పాలి ? అసలు బోల్డ్ ప్రపంచంలో వీళ్ల గురించి తెలియని సగటు నెటిజన్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో వీళ్లు తమ బోల్డ్ నెస్ ను విచ్చలవిడిగా విపరీత ధోరణి లో రెచ్చిపోయి ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు వీళ్లద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ అంతా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 21, 2022 / 03:33 PM IST
    Follow us on

    Kangana Ranaut Poonam Pandey: వివాదాల రాణి ‘కంగనా రనౌత్’ గురించి ఏమి అని చెప్పా లి ? బూతుల రాణి ‘పూనమ్ పాండే’ గురించి ఎంత అని చెప్పాలి ? అసలు బోల్డ్ ప్రపంచంలో వీళ్ల గురించి తెలియని సగటు నెటిజన్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో వీళ్లు తమ బోల్డ్ నెస్ ను విచ్చలవిడిగా విపరీత ధోరణి లో రెచ్చిపోయి ప్రదర్శిస్తూ ఉంటారు.

    Kangana Ranaut Poonam Pandey

    అసలు వీళ్లద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ అంతా కాంట్రవర్సీ మయం అయిపోతుంది. కంగనా అసలు ఎదిగిందే వివాదాలపై. ఇక పూనమ్ గుర్తింపు తెచ్చుకుందే ఘాటు వీడియోలతో. మరి వీరిద్దరూ కలుసుకుని ముచ్చటించుకుంటూ పోతే ఎలా ఉంటుంది ? గాసిప్ రాయుళ్లకు అదిరిపోతోంది కదా. అలాగే అదిరిపోయింది. కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాకప్‌’లో ఈ సంఘటన జరిగింది.

    డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవడానికి వారి రహస్యాలు బయటపెడుతూ ఉంటారు. లేదా డిఫెరెంట్ టాస్క్ లు ఇస్తుంటారు. ఈ క్రమంలో హాట్‌ బ్యూటీ పూనమ్‌ పాండేకు ‘సమ్మోహనురాలు’ అనే టాస్క్‌ ఇవ్వడం జరిగింది. అద్భుతమైన ఎమోషన్ పండించు అమ్మా అంటే.. పూనమ్ భయపడుతుంది గానీ, బోల్డ్ లుక్స్ తో కాస్త రెచ్చిపో అమ్మా అంటే.. పూనమ్ ఎందుకు ఊరుకుంటుంది ?

    Also Read: ఓటీటీ రివ్యూ : జల్సా – అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం

    బోల్డ్ అనే పదం కూడా సిగ్గుతో చితికి పోయేలా పూనమ్ తన టాలెంట్ చూపించింది. పూనమ్‌ ఘాటు ఫోజులు చూసి కంగనా కూడా తట్టుకోలేకపోయింది. ఆమె పై వెచ్చని ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తింది. ‘పూనమ్‌ నువ్వు చాలా హాట్‌గా కవ్వించి అదరగొట్టావ్. నిన్ను చూస్తుంటే.. నాకే హాట్‌గా అనిపిస్తోంది.

    అసలు నాకు తెలియని హాట్ నెస్ ఏముంది ? అలాంటిది నాకే హీట్ పెంచావ్ అంటే.. అసలు నువ్వు ఏ స్థాయిలో హాట్ హాట్ గా యాక్ట్‌ చేశావో అర్ధం చేసుకోవచ్చు. సెడక్షన్‌ అనేది ఒక అద్భుతమైన కళ. నా వరకు వస్తే.. మనకున్న 64 కళల్లో సమ్మోహన కళ చాలా గొప్పది. నువ్వు అందులో గొప్ప కళాకారిణి. నువ్వు మహిళలకు సమ్మోహన కళను నేర్పించవచ్చు. ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. నాకు కూడా ఆ కళలో కోచింగ్‌ ఇవ్వొచ్చు’ అంటూ పూనమ్‌ పాండే బూతు పై బూతుల హీరోయిన్ ప్రశంసలు కురిపించింది.

    Also Read: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

    Recommended Video:

    Tags