Kamna Jethmalani: ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తమ అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ డం సంపాదించుకున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకని ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కెరీర్ మంచి పీక్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అలా సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్లలో కామ్నా జట్మలాని కూడా ఒకరు. ఈమె పేరు అంతగా తెలియకపోవచ్చు కానీ, గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమా హీరోయిన్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. రణం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. కానీ రణం సినిమా తో ఆమెకు వచ్చిన క్రేజ్ మరి ఏ సినిమాతో కూడా రాలేదు అని చెప్పడం లో సందేహం లేదు. రింగు రింగుల జుట్టు, చూడ చక్కని రూపం, తన అందమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తెలుగులో ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా కామ్నా గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హీరో గోపీచంద్ కెరీర్ లో రణం సినిమా వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే కామ్నా జట్మాలానికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ తో జోడిగా బెండు అప్పారావు సినిమాలో నటించింది. తెలుగులో పలు సినిమాలలో నటించిన కామ్నా జట్మలాని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యింది. తెలుగు తో పాటు ఈమె కన్నడ, తమిళ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఈమె ఆగస్టు 11, 2014లో బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. కానీ కామ్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కామ్నా జట్మలాని తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా కామ్నా జట్మలాని షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజెన్లు షాక్ అవుతున్నారు. ఒకప్పుడు చాలా ముద్దుగా, ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఈ అమ్మడు పూర్తిగా సన్నబడిపోయి గ్లామర్ ఫోజులతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది. సినిమాలలో ఫ్రీ ఎంట్రీ ఇవ్వచ్చుగా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు మాత్రం తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది అని తెలుస్తుంది.