Kamal Hasan: కమల్​ ‘విక్రమ్’​ సినిమా ఫస్ట్​ గ్లాన్స్​ రిలీజ్​ అప్పుడే!

Kamal Hasan: కమల్​హాసన్​ హీరోగా లోకేశ్​ కనగరాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా విక్రమ్. ఇందులో విజయ్​ సేతుపతి, ఫాహద్​ ఫజిల్​ కీలక పాత్రల్లో కనిపంచనున్నారు. ఈ సినిమాను కమల్​ హాసన్​ తన సొంత బ్యానర్​ రాజ్​ కమల్​ ఫిల్మ్స్​ ఇంటర్నేష్నల్​పై ఆర్​. మహేంద్రన్​తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్​డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. కమల్​హాసన్​ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 5, 2021 7:55 pm
Follow us on

Kamal Hasan: కమల్​హాసన్​ హీరోగా లోకేశ్​ కనగరాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా విక్రమ్. ఇందులో విజయ్​ సేతుపతి, ఫాహద్​ ఫజిల్​ కీలక పాత్రల్లో కనిపంచనున్నారు. ఈ సినిమాను కమల్​ హాసన్​ తన సొంత బ్యానర్​ రాజ్​ కమల్​ ఫిల్మ్స్​ ఇంటర్నేష్నల్​పై ఆర్​. మహేంద్రన్​తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్​డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. కమల్​హాసన్​ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్​ బర్త్​డే విషెస్​ తెలుపుతూ దర్శకుడు కనగరాజ్​ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. దీంతో పాటు, విక్రమ్​ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ గ్లాన్స్​ను శనివారం సాయంత్రం సాయంత్రం 6 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపారు.

దీంతో కమల్​ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎప్రిల్​లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్​ ప్లాన్​ చేస్తోంది. కాగా, గతంలో కమల్​ తనే సొంతంగా కథ రాసుకొని తీసిన విశ్వరూపం, విశ్వరూపం 2 చిత్రాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే, ఈ రెండు సినిమాలకు జాతీయ స్థాయిలో మంచి పేరు లభించింది. ఆ తర్వాత వచ్చిన ఉత్తమ విలన్​లో కమల్​ నటనకు ప్రజలు నీరాజనాలు పట్టారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో దిగ్గజ దర్శకులు బాలచందర్​, కె.విశ్వనాథ్​లు కీలకపాత్ర పోషించారు. మరి విక్రమ్​ సినిమాతో థియేటర్లలో  ఎలాంటి రెస్పాన్స్​ సాధిస్తారో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాల్సిందే.