
సకల కళా వల్లభుడైన కమల్ హాసన్ నటుడిగా ఎన్నో ప్రయోగాలకు నాంది పలికాడు. నటుడిగానే గాక గాయకుడిగా , స్క్రీన్ ప్లే రచయితగా , నిర్మాతగా , నృత్య దర్శకుడిగా ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఇంతవరకు తాను నటించిన చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు . ఇపుడు తొలి సారిగా బయటి హీరో ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అటు నటుడిగా , ఇటు దర్శకుడిగా రెండు భాద్యతలు మోయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం అనిపించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ..పైగా కొత్తగా రాజకీయాల్లో కూడా బిజీ గా ఉంటున్నాడు.
జర్నలిస్టుల సమస్య.. కేసీఆర్ కు నిజంగా తెలియదా?
నవరస నటుడు కమలహాసన్ దర్శకత్వంలో రూపొందే ఒక చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నాడు. నిజానికి కమల్ హాసన్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ‘తలైవాన్ ఇరుక్కింద్రాన్’ టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేసింది.నిజానికి ఈ చిత్రాన్ని “దేవర్ మగన్ ” ( క్షత్రియ పుత్రుడు ) సీక్వెల్ చిత్రం గా నిర్మించాలి అనుకొన్నారు. అయితే, తాను నటిస్తూ దర్శకత్వం చేయడం తలకుమించిన భారం అవుతుందన్న ఉద్దేశంతో కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించకుండా కేవలం దర్శకత్వం వహించడానికే నిర్ణయం తీసుకున్నాడట. దాంతో హీరో పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకున్నట్టు తెలుస్తోంది.