Pawan Kalyan : ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ని 2025 వ సంవత్సరం కి గానూ, ఆస్కార్ అవార్డ్స్(Oscar Awards) కమిటీ లో మెంబెర్ గా ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. ఒకపక్క ‘థగ్ లైఫ్'(Thug Life) మూవీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, మరో పక్క వివాదాల్లో చిక్కుకున్న కమల్ హాసన్ కి ఈ గొప్ప సత్కారం దొరకడం ఆయన అభిమానులకు ఎంతో గర్వ కారణం అని చెప్పొచ్చు. కమల్ హాసన్ కి ఈ అరుదైన పురస్కారం దక్కడం తో సినీ మరియు రాజకీయ రంగాలకు చెందినవారు శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు. వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ఉన్నాడు. కమల్ హాసన్ తో పవన్ కళ్యాణ్ కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘానా విజయం సాధించినప్పుడు కమల్ హాసన్ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ సంభాషణ జరిగింది.
కమల్ హాసన్ అప్పట్లో ఈ విషయాన్ని ట్విట్టర్ లో కూడా పంచుకున్నాడు. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కమిటీ మీ సభ్యుడిగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిన్న పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ వేసాడు. ‘పద్మభూషణ్ కమల్ హాసన్ గారిని 2025 వ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ కమిటీ మెంబెర్ గా ఎంపిక అవ్వడం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి దక్కిన అరుదైన గౌరవం. 6 దశాబ్దాలుగా కమల్ హాసన్ గారు సినిమాకు చేసిన సేవలు అపూర్వం. నటుడిగా,రచయితగా,దర్శకుడిగా, గాయకుడిగా, ఇలా ప్రతీ క్రాఫ్ట్ లోనూ అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆ మహానుభావుడు ఇండియన్ సినిమాపై చూపిన ప్రభావం ఎన్నటికీ మరచిపోలేము. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వరల్డ్ సినిమాకు రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఎన్నో సేవలు అందించాలి’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
దీనికి కమల్ హాసన్ స్పందిస్తూ ‘నీ అమూల్యమైన విషెస్ కి ధన్యవాదాలు బ్రదర్. గ్లోబల్ స్టేజ్ మీద మన ఇండియన్ సినిమా కి సేవ చేసుకోవడం ఒక అదృష్టం గా భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వాస్తవం గా రాజకేయపరంగా పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ దారులు వేర్వేరు. కానీ వ్యక్తిగతంగా వీళ్లిద్దరు ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకుంటారు. కమల్ హాసన్ గారు కనిపిస్తే కాళ్లకు నమస్కారం చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఒక తమిళ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఒక ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఒక లెజండరీ నటుడి పట్ల పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ గౌరవాన్ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Thank you brother, for your kind words and warm wishes. Honoured to serve and represent Indian cinema on the global stage. https://t.co/ioBJYP1sH1
— Kamal Haasan (@ikamalhaasan) June 29, 2025