Bharateeyudu 2 Trailer : భారతీయుడు 2 ట్రైలర్ రివ్యూ : సినిమాలో అదొక్కటే మైనస్ గా మారబోతుందా..?

Bharateeyudu 2 Trailer : ఇక శంకర్ గత చిత్రం అయిన ఐ, రోబో 2.0 విజువల్స్ పరంగా సూపర్ గా ఉన్న కూడా కథ పర్గా ఫెయిల్ అయ్యాయి మరి ఇది కూడా అదే దారిలోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి...

Written By: Gopi, Updated On : June 25, 2024 7:57 pm

Bharateeyudu 2 Trailer

Follow us on

Bharateeyudu 2 Trailer : కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ కమలహాసన్ అభిమానులు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన కమెంట్లైతే చేశారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమాని జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చాలా లావిశ్ గా, గ్రాండ్ గా ఇక శంకర్ సినిమాలో ఎలాంటి రిచ్ నెస్ అయితే ఉంటుందో అలాంటి పర్ఫెక్ట్ విజవల్స్ తో కూడిన ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇక దీని ద్వారా సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక భారతీయుడు సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఆయన ‘మర్మ కళ’ ద్వారా సినిమా చూసే ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు.

ఇక ఎవరైనా సరే పంచం తీసుకోవాలి అంటే భయంతో వణుకు పుట్టేలా అందరి గుండెల్లో చరమగీతాన్ని మోగించాడు. అలాంటి సేనాపతి మరోసారి వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న థాట్ ని బేస్ చేసుకొని ఈ భారతీయుడు 2 అయితే చేశారు. ఈ సినిమా ఎవరైనా అన్యాయం, అక్రమాలు చేస్తే వాళ్లను శిక్షించే ఒక పాత్రలో కమలహాసన్ కనిపిస్తున్నాడు. ఇక మొదటి భారతీయుడు తో పోలిస్తే ఇందులో అంత డెప్త్ అయితే చూపించలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లంచం తీసుకున్నాడనే కారణం తో తన కొడుకు ను సైతం చంపేసే క్యారెక్టర్ లో కనిపించిన సేనాపతి స్టోరీ చాలా బలంగా ఉంటుంది.

ఇక భారతీయు 2 కి వచ్చేసరికి కథ అంతా బలంగా అయితే కనిపించడం లేదు. ఇక విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమాలో కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం రొటీన్ కథనే మళ్లీ చెబుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అన్యాయం, అక్రమాలు, లంచాల మీద ఇండియా వైడ్ గా చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ అయితే మరి కొన్ని ఫెయిల్యూర్ గా మారాయి. మరీ మరోసారి అదే పాయింట్ ను బేస్ చేసుకొని సినిమా తీసి సక్సెస్ కొట్టడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంది…ఇక శంకర్ గత చిత్రం అయిన ఐ, రోబో 2.0 విజువల్స్ పరంగా సూపర్ గా ఉన్న కూడా కథ పర్గా ఫెయిల్ అయ్యాయి మరి ఇది కూడా అదే దారిలోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి…