Kamal Haasan: ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, రజినీకాంత్ లు టాప్ హీరోలుగా కొనసాగారు. తమిళంలో రజనీకాంత్ సూపర్ స్టార్ గా వెలుగొందితే, తెలుగులో మాత్రం చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా వాళ్లకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేశాయి.
అయితే వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా మాస్ సినిమాలను చేస్తూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక వీళ్ళతో పాటు సూపర్ స్టార్ గా ఎదిగిన మరొక హీరో కమల్ హాసన్… లోక నాయకుడుగా పిలవబడే కమలహాసన్ మాస్ సినిమాలకు దూరంగా ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కంటెంట్ బెస్డ్ సినిమాల మీదనే డిపెండ్ అవుతూ సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను అందుకునేవాడు. అయితే ఈయనకు సపరేట్ గా క్లాస్ ఆడియన్స్ మాత్రమే ఫ్యాన్స్ గా ఉండేవారు మాస్ లో ఈయనకు పెద్దగా గ్రిప్ ఉండకపోయేది.ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి రజనీకాంత్ లు సౌత్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న కూడా కమలహాసన్ క్లాసికల్ సినిమాలు తీస్తూ విజయాలను అందుకుంటూ చాలా అవార్డులను కూడా గెలుచుకున్నాడు.
ఇక ఒకానొక టైమ్ లో చిరంజీవి, రజనీకాంత్ ఎంత పెద్ద టాప్ హీరోలు అయినప్పటికీ కమల్ హాసన్ ని చూసి ఒక్క విషయంలో మాత్రం భయపడేవారట. కమలహాసన్ క్లాసికల్ సినిమాల్లో నటిస్తూ జెన్యూన్ యాక్టింగ్ ని చూపిస్తూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేవాడు.
ఉదాహరణకి స్వాతిముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం లాంటి సినిమాలు చూస్తే ఆ సినిమాలు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేరు అనే విషయాన్ని ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే కమలహాసన్ స్టఫ్ ఏంటి అనేది ఆ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నటనలో ఆయన్ని ఢీ కొట్టేవాడు లేడు అనేది వాస్తవం. ఇక ఇది ఇలా ఉంటే సాగర సంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం లాంటి సినిమాలు మనం చేయలేము అనే ఒక్క విషయంలో చిరంజీవి, రజనీకాంత్ కమలహాసన్ ను చూసి భయపడినట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి…