Kalyan Ram Bimbisara: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసార’ మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కల్యాణ్‌రామ్‌కు జోడిగా కేథరిన్, సంయుక్త మేనన్‌లు నటించారు. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతోంది.

పైగా కల్యాణ్ రామ్ పూర్తి యాక్షన్ మోడ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కాకపోతే, కల్యాణ్ రామ్ కత్తి పట్టుకుని చేసే విన్యాసాలు ఎవరికీ కావాలి ?. నందమూరి అభిమానులు మాత్రం ఆ విన్యాసాలను ఎంతవరకు అని చూస్తారు. ఎలాగూ బాలయ్య, ఎన్టీఆర్ అలాంటి విన్యాసాలే కదా చేసేది. మళ్ళీ కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు ఆ విన్యాసాల మీదే పడితే ఏమి ఉపయోగం ?
Also Read: Actor Hema: డ్రగ్స్ కేసులో తన పేరు ఆ మీడియా వెల్లడించడంపై నటి హేమ నిప్పులు
అయినా మగధీర, బాహుబలి సినిమాల కన్నా గొప్పగా ఏమి చూపిస్తారు ఈ సినిమాలో. దీనికి తోడు కల్యాణ్ రామ్ క్యారెక్టర్‌లో నెగిటీవ్ ఛాయలు ఉంటాయట. సాఫ్ట్ పాత్రల్నే కళ్యాణ్ రామ్ కరెక్ట్ గా పోషించలేడు అని టాక్ ఉంది. అలాంటిది ఇక నెగిటివ్ పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తాడు ? పైగా ఈ బింబిసార సినిమా పూర్తిగా కత్తి – డాలు టైపు కథతో సాగుతుంది.
అలాగే కథలో రెండు కోణాలున్నాయట. అయినా కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా కనిపించడమే కష్టం, ఇక నటించి మెప్పించడం ఎలా ? అన్నట్టు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట. పాన్ ఐడియా లెవల్ లో స్కోప్ ఉందట. స్కోప్ ఉన్నా మార్కెట్ ఉండక్కర్లేదా ? మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. ఏది ఏమైనా ‘నందమూరి కళ్యాణ్ రామ్’ సినిమాల సెలెక్షన్ మొదటినుండి విభిన్నంగానే సాగుతుంది.

విజయమో, వైఫల్యమో – ఏదీ పట్టించుకోకుండా ప్రయోగాల చేస్తూనే వెళ్తుంటాడు కల్యాణ్ రామ్. కొత్త కథల్ని తెరకెక్కించడం అంటే తనకు భలే సరదా. బింబిసార కూడా అలాంటి ప్రయత్నమే. కానీ రిజల్ట్ కూడా రెగ్యులర్ గానే వస్తే.. కళ్యాణ్ రామ్ కి భారీ నష్టాలు ఉంటాయి. అప్పుడు ఎన్టీఆర్ కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. మరి చివరకు బింబిసార ఏం చేస్తాడో చూడాలి.
[…] AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్ర స్వరూపమే మారిపోతోంది. ఇన్నాళ్లు ఒకలా ఉన్న చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి లోక్ సభను జిల్లా కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. దీంతో రాష్ర్ట ముఖచిత్రమే మారిపోయింది. ఈ మేరకు వర్చువల్ గా కేబినెట్ సమావేశమై కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆమోదం తెలిపడం తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లో కొత్త జిల్లాల పరిపాలన వ్యవహారాలు కొనసాగించేందుకు ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. […]
[…] RRR 9th Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. […]