https://oktelugu.com/

Bimbisara First Review: ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ – ‘బింబిసార’

Bimbisara First Review: నటీనటులు : కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సా , వరినా హుస్సేన్ తదితరులు. దర్శకుడు : వశిష్ట స్క్రీన్ ప్లే : వశిష్ట కెమెరా మెన్ : చోటా కె నాయుడు ఎడిటర్ : తమ్మిరాజు నిర్మాత : హరి, కళ్యాణ్ రామ్. *పరిచయం* : నందమూరి కళ్యాణ్ రామ్ మీద పాన్ ఇండియా బడ్జెట్ వర్కౌట్ కాదు అని తెలిసినా.. రిస్క్ చేసి మరి ఎన్టీఆర్ హార్ట్స్ హరి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 4, 2022 / 04:53 PM IST

    Bimbisara First Review

    Follow us on

    Bimbisara First Review: నటీనటులు : కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సా , వరినా హుస్సేన్ తదితరులు.

    దర్శకుడు : వశిష్ట

    స్క్రీన్ ప్లే : వశిష్ట

    కెమెరా మెన్ : చోటా కె నాయుడు

    ఎడిటర్ : తమ్మిరాజు

    నిర్మాత : హరి, కళ్యాణ్ రామ్.

    kalyan ram

    *పరిచయం* :

    నందమూరి కళ్యాణ్ రామ్ మీద పాన్ ఇండియా బడ్జెట్ వర్కౌట్ కాదు అని తెలిసినా.. రిస్క్ చేసి మరి ఎన్టీఆర్ హార్ట్స్ హరి ఈ బింబిసార సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. చారిత్రక పాత్రను కల్పిత కథనంతో వెండితెరపై అద్బుతంగా ఆవిష్కరించాం అని ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ బృందం గొప్పలు చెప్పుకొచ్చింది. మరీ ఆ గొప్పల్లో వాస్తవం ఎంత ఉంది ?, అసలు ఈ సినిమాలో మ్యాటర్ ఉందా ?, లేదా ? అని రివ్యూ చూద్దాం రండి.

    Also Read: Sita Ramam First Review: ప్రీ రివ్యూ: ‘సీతారామం’

    *కథ* :

    టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ కథ మొదలైంది. త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు (కళ్యాణ్ రామ్) క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం గొప్ప రాజు. అతనికి ఎదురు లేని కాలం అది. అయితే.. ఆ కాల ప్రవాహంలో బింబిసారుడు కలిసిపోతాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం బింబిసారుడు ఈ డిజిటల్ యుగంలో మళ్ళీ పుడతాడు. అయినా గతం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. దాంతో కాలంతో వెనక్కి ప్రయాణించి, నేటి ప్రపంచంలోకి వచ్చి తనకు చెందిన నిధిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బింబిసారుడు జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటీ ?, అతని జీవితం ఎలా మారింది ?, చివరకు అసలేం జరిగింది ?, అసలు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

    *విశ్లేషణ* :

    భారీ హిట్ కోసం పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కెరీర్ ను ఈ సినిమా కొత్త మలుపు తిప్పింది. అంత గొప్పగా ఈ సినిమాలో ఏముంది అంటారా ?, .. ఒక్క మాటలో చెప్పాలంటే.. బింబిసార చిత్రం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి కథ, కానీ కంటెంట్ పరంగా మాత్రం మరో పదేళ్ల తర్వాత కథ. అంతగా ఈ కథనం సాగింది. ప్రతీ సీన్ చాలా ఫ్రెష్ గా ఉంది. పైగా ఈ ఫిక్షనల్ స్టోరీలో ఎక్కడా రిఫరెన్స్‌లు కనిపించవు. ఈ విషయంలో కచ్చితంగా దర్శకుడిని అభినందించాలి.

    kalyan RAM

    ముఖ్యంగా బింబిసార పాత్రను, అతడి రాజ్యాన్ని సృష్టించిన విధానం అద్భుతం. కాకపోతే, బింబిసార పాత్రకి ఫస్టాఫ్ లోనే ముగింపు ఇవ్వడం ఆ పాత్ర అభిమానులకు నచ్చదు. అయితే, రెండో భాగంలో అదే బింబిసార పాత్రతో తాజా కథ ప్రారంభమవుతుంది. ఇది కూడా చాలా వరకూ ఫ్రెష్ గా అనిపిస్తోంది. అదే విధంగా సెకండ్ హాఫ్ లో బింబిసారలోని రెండో కోణాన్ని ఆవిష్కరించారు. ఈ కోణం మొత్తం సినిమాలోనే హైలైట్ అవుతుంది.

    నటి నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా కళ్యాణ్ రామ్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు కళ్యాణ్ రామ్. సాధారణమైన లుక్ నుంచి స్టైలిష్ వారియర్ లుక్ లోకి కళ్యాణ్ రామ్ మారిన విధానం, ఆ లుక్ కోసం కళ్యాణ్ రామ్ పడిన కష్టం గురించి మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి కళ్యాణ్ రామ్ తన తరపున ఈ సినిమాకి చేయగలిగినంత చేసాడు.

    ఇక సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెస్సాలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తమ అందచందాలతో చాలా బాగా ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు. మొత్తమ్మీద ఈ చిత్రం గ్రాఫిక్స్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. హిస్టరీ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ ఆకట్టుకుంటుంది.

    *తీర్పు :*

    కళ్యాణ్ రామ్ చిత్రాలకు ఎప్పుడూ లేనంతగా పాజిటివ్ బజ్ ఈ సినిమాకి వచ్చింది. ఆ బజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా బాగుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ కూడా అదిరిపోయాయి. తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే, ఒక్క మాటలో డోంట్ మిస్ ఇట్.

    Also Read:Pokiri Movie Re- Release: మహేష్‌ బాబు డై హార్ట్‌ ఫ్యాన్స్‌ సంచలన నిర్ణయం.. ఇక మోత మోతే !


    Tags