https://oktelugu.com/

Kalyan Dev Sreeja: కళ్యాణ్ దేవ్ – శ్రీజా మళ్ళీ కలిసిపోబోతున్నారా..? ఈ ట్వీట్ ను చూసి ఆశ్చర్యపోతున్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో వచ్చిన కొత్తలో చిన్న కూతురు శ్రీజా, భరద్వాజ్ అనే అతన్ని ప్రేమించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 17, 2023 / 01:29 PM IST

    Kalyan Dev Sreeja

    Follow us on

    Kalyan Dev Sreeja: ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. ముందుగా సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం ఎక్కువ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మరీ విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. కానీ సెలబ్రెటీలు ఇలా ప్రవర్తించడం వల్ల వారి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిమాన నటీనటులు విడాకులు తీసుకోవడం వల్ల వీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారట. అయితే చిరంజీవి కూతురు శ్రీజా ఈ మధ్య గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటో తెలుసుకోండి

    మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో వచ్చిన కొత్తలో చిన్న కూతురు శ్రీజా, భరద్వాజ్ అనే అతన్ని ప్రేమించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలీ పరువు తీసిన సంగతి తెలిసిందే. అతనితో సంతానం పొందిన తర్వాత ఆమె కొన్నాళ్లకు విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చింది. చిరు శ్రీజని మళ్లీ తన ఇంటికి తీసుకొచ్చి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో గ్రాండ్ గా రెండవ పెళ్లి చేశాడు. కొంతకాలం మంచిగా సంసార జీవితం కొనసాగించినప్పటికీ, కొన్ని అనుకోని సంఘటనలు వీళ్లిద్దరి జీవితంలో చోటు చేసుకోవడం, విడిపోవడం వంటివి జరిగింది.

    కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజా ఒక బిడ్డకు జన్మనిచ్చి సంగతి తెలిసిందే. కొద్ది రోజులు ఆ బిడ్డ శ్రీజా దగ్గర ఉంటే, మరికొద్ది రోజులు కళ్యాణ్ దేవ్ తో ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. శ్రీజ మొదటి భర్త కూతురుతో కూడా కళ్యాణ్ దేవ్ సాన్నిహిత్యంగా ఉండేవారు. ఈమెను కూడా రీసెంట్ గా ఎన్నో సార్లు కలిసిన సందర్బాలు మనం అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చూస్తునే ఉన్నాం. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. వీళ్లిద్దరు విడాకులు రద్దు చేసుకొని మళ్లీ ఒకటి అయిపోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

    ఈ మధ్య శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు పరోక్షంగా పెడుతున్న కొన్ని కొటేషన్స్ చూస్తుంటే వీరిద్దరు కలవబోతున్నారని అనిపిస్తుంది. ఇదే నిజం అయితే మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారు. శ్రీజా విషయంలో మెగా ఫ్యాన్స్ కి మొదటి నుంచి అసంతృప్తి ఉండేది. ఒకసారి చిరు ఇమేజ్ డ్యామేజ్ అయిందంటే.. రెండోసారి కూడా విడాకులు తీసుకొని తలెత్తుకోలేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ చిరంజీవి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా వ్యాపించేలా చేస్తుంటే.. శ్రీజ మాత్రం పరువు తీస్తుందంటూ విమర్శించారు.దీంతో ప్రజెంట్ వచ్చే వార్తలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.