Homeఎంటర్టైన్మెంట్Radisson Drugs Case: డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన యూట్యూబ్ హీరోయిన్... మరికొందరు ప్రముఖులు!

Radisson Drugs Case: డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన యూట్యూబ్ హీరోయిన్… మరికొందరు ప్రముఖులు!

Radisson Drugs Case: టాలీవుడ్ లో వరుస డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత ఏడాది నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అరెస్ట్ చేసిన పోలీసులు అతని డ్రగ్ నెట్వర్క్ ని ఛేదించే ప్రయత్నం చేశారు. అలాగే హీరో నవదీప్ పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, సుబ్బరాజు, రానా, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్, తనీష్… ఇలా పలువురు సినీ తారలు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు.

తాజాగా రాడిసన్ హోటల్ పై జరిగిన అధికారుల దాడిలో పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకుల వారసులు పట్టుబడ్డారు. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో యూట్యూబ్ హీరోయిన్ కల్లపు లిషి గణేష్ (Kallapu Lishi Ganesh) పట్టుబడినట్లు తెలుస్తుంది. ఎఫ్ ఐ ఆర్ లో ఆమె పేరును పొందుపరిచారు. లిషి గణేష్ తో పాటు వీఐపీ శ్వేతను కూడా అదుపులోకి తీసుకున్నారట.

బీజేపీ నేత గజ్జల వివేకానంద ఈ పార్టీ ఇవ్వగా లిషి గణేష్ తో పాటు పలువురు సెలెబ్స్, బడా బాబుల వారసులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసులో పాల్గొన్న విఐపీ ల పేర్లు బయటకు రాలేదు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ డ్రగ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ ఎక్కువైపోయింది అందడానికి ఈ కేసులే నిదర్శనం. వీకెండ్ వస్తే చాలు లగ్జరీ హోటల్స్, పబ్స్ లో డ్రగ్ పార్టీలు చోటు చేసుకుంటున్నాయి.

గతంలో కూడా రాడిసన్ హోటల్ పై దాడులు జరిగాయి. అప్పుడు కూడా లిషి గణేష్ పట్టుబడినట్లు తెలుస్తుంది. లిషితో పాటు ఆమె సిస్టర్ ని కూడా గత ఏడాది అరెస్ట్ చేశారు. లిషి చెల్లులు పేరు కుషిత. కాగా ఇటీవల యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ దొరికిన విషయం తెలిసిందే. తన నివాసంలో కొంత మేర గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం షణ్ముఖ్ బెయిల్ పై విడుదలయ్యాడు.

RELATED ARTICLES

Most Popular