Kalki 2898 AD Trailer YouTube Views
Kalki Movie: కల్కి 2829 AD విడుదలకు సమయం దగ్గర పడింది. రెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయితే సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్ లేదని తెలుస్తుంది. మొదటి నుండి కల్కి ప్రమోషన్స్ కోసం టీం చాలా కష్టపడుతున్నారు. వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రయోజనం మాత్రం నిల్. ఒక్క రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ కి రూ. 40 కోట్లు వరకు ఖర్చు అయ్యాయని సమాచారం.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనంద్ మహీంద్రా సహకారంతో బుజ్జి పేరుతో మూడు చక్రాల ఫ్యూచర్ కార్ రూపొందించారు. దాన్ని వివిధ నగరాల్లో ప్రదర్శనకు పెడుతున్నారు. కేవలం ప్రమోషన్స్ కి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. కాగా కల్కి ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ అందరినీ షాక్ కి గురి చేసింది. యూట్యూబ్ లో కల్కి ట్రైలర్ ని పట్టించుకున్న నాథుడే లేడని తేలిపోయింది. సలార్, కెజిఎఫ్ 2 ట్రైలర్స్ వ్యూస్ కి కల్కి వ్యూస్ కి పొంతన లేదు.
Also Read: Kalki 2898 AD: కల్కి కి దీపికా పదుకొనె ప్లస్సా? మైనస్సా? తేడా కొడితే అంతే!
జూన్ 10న కల్కి ట్రైలర్ గ్రాండ్ గా పలు భాషల్లో విడుదల చేశారు. ఇండియా వైడ్ ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోని థియేటర్స్ లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. ట్రైలర్ బాగానే ఉందని జనాలు అభిప్రాయ పడ్డారు. యూట్యూబ్ లో మాత్రం వ్యూస్ రాలేదు. 24 గంటల్లో కల్కి ట్రైలర్ వ్యూస్ కేవలం 34 మిలియాన్స్ మాత్రమే. ప్రభాస్ గత చిత్రం సలార్ ట్రైలర్ 113 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఒక అర్థం చేసుకోవచ్చు కల్కి పై ఉన్న హైప్ ఏమిటో.
Also Read: Mahesh Babu-Rajamouli Movie: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న స్టార్ హీరోయిన్…
అంతెందుకు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా ఉన్న రాధే శ్యామ్, ఆదిపురుష్ ట్రైలర్స్ కూడా కల్కి కంటే మెరుగైన వ్యూస్ రాబట్టాయి. ఆదిపురుష్ ట్రైలర్ 24 గంటల్లో 74 మిలియన్ వ్యూస్ అందుకుంది. రాధే శ్యామ్ ట్రైలర్ 58 మిలియన్ వ్యూస్ రాబట్టింది. కల్కి ఆ చిత్ర ట్రైలర్స్ వ్యూస్ లో సగం మాత్రమే పొందింది. సైన్స్ ఫిక్షన్ జోనర్స్ మాస్ ఆడియన్స్ ఇష్టపడరు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చుతుందనే గ్యారంటీ లేదు. ఊరమాస్ ఆశించే పంచ్ డైలాగ్స్, కత్తితో ఊచకోత కోయటం కల్కిలో ఉండవు. మరి చూడాలి తెలుగు రాష్ట్రాల ఆడియన్సు కాల్కిని ఎలా ఆదరిస్తారో…
Web Title: Kalki 2898 ad trailer youtube views danger signs