Kalki 2 Mahabharata scenes extended: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రస్థానం ఉన్న సినిమాల్లో ఒకటి ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD). ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనే వంటి ప్రముఖులు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇలాంటి సెన్సేషనల్ రికార్డ్స్ మాత్రమే కాదు, కంటెంట్ పరంగా కూడా ‘కల్కి’ చిత్రం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక సరికొత్త బెంచ్ మార్ అనే చెప్పొచ్చు. కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ బుర్రలో ఇలాంటి ఆలోచన తోచడమే అద్భుతం అయితే, తానూ అనుకున్నది అనుకున్నట్టు వెండితెర పై చూపించడం మరో అద్భుతం.
థియేటర్ లోకి వచ్చి ఈ సినిమాని చూస్తున్నంతసేపు మనకు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. 800 ఏళ్ళ తర్వాత మన భూమి మీద చుక్క నీళ్లు కూడా లేని రోజులు వస్తాయని, అలా ప్రక్రుతి అంతరించిపోతున్న సమయం లో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడని , అతని జననం ని అడ్డుకోవడానికి ‘కలి’ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడని, అతన్ని అడ్డుకొని ‘కల్కి’ జననం కోసం కర్ణుడు పునర్జన్మ ఎత్తడం, మహాభారతం లో శ్రీకృష్ణుడి శాపానికి గురైన అశ్వథామ పోరాటం చేయడం , ఇలాంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రం కథ ని రాసుకున్నాడు. అయితే మొదటి భాగం లో మహాభారతం ఎపిసోడ్స్ ని కేవలం మూడు నిమిషాలు మాత్రమే చూపించారు. కానీ రెండవా భాగం లో మహాభారతం ఎపిసోడ్ ని ఏకంగా 30 నిమిషాల వరకు చూపించబోతున్నారని టాక్. కురుక్షేత్రం ఘట్టాలను ఈ 30 నిమిషాలు చూపించబోతున్నారట.
Also Read: ‘పుష్ప 3’ లో హీరోయిన్ గా స్టార్ క్రికెటర్ సతీమణి.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ అప్డేట్!
కర్ణుడు , అర్జునుడు మధ్య జరిగిన యుద్ధం, కృష్ణుడి ఎత్తులు, అశ్వథామ శాపనాయికి గురవ్వడం , కలి జననం, ఇవన్నీ రెండవ భాగం లో చూపించబోతున్నారు అట. కేవలం మూడు నిమిషాల మహాభారతం సన్నివేశానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. కానీ ఇప్పుడు ఏకంగా 30 నిమిషాల నిడివి ఉన్న మహాభారతం ఎపిసోడ్ రానుంది. ఇక ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ విద్వంసం జరగబోతుందో ఊహించుకోవచ్చు. మొదటి భాగం లో ఎలా అయితే ఆరంభం లో మహాభారతం సన్నివేశాలను చూపించారో , రెండవ భాగం లో కూడా అదే విధంగా ఆరంభంలోనే మహాభారతం సన్నివేశాలను చూపిస్తారట. ఈ సన్నివేశాలు పూర్తిగా అయ్యాక, ఫ్లాష్ బ్యాక్ లో మొదటి భాగం లోని గ్లింప్స్ లు చూపించి, అప్పుడు వర్తమాన కథలోకి అడుగుపెడుతారట. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మొదటి షెడ్యూల్ లో పాల్గొన్నారు. త్వరలో మొదలయ్యే రెండవ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు.