Kalivi Vanam Movie Review: నటీనటులు : సమ్మెట గాంధీ, నాగ దుర్గ, బిత్తిరి సత్తి…
మ్యూజిక్ : మదిన్
డైరెక్టర్ : రాజ్ నరేంద్ర
ప్రస్తుతం తెలంగాణ నేపథ్యం లో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. గ్రామీణ వాతావరణం చూపిస్తూ అక్కడి లోకల్ స్లాంగ్ తో ప్రేక్షకులను అలరించే సినిమాలు రావడం విశేషం…ప్రతి ఒక్క దర్శకుడు సైతం ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే గ్రామీణ వాతావరణానికి సంబంధించిన ఒక మెసేజ్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘కలివనం’ అనే సినిమా నవంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఈరోజు నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రివ్యూ ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల పరిధిలోని ‘గుంట్రాజు పల్లి’ అనే ఒక గ్రామంలో భూమయ్య (సమ్మెట గాంధీ) అనే ఒక వ్యక్తి తన మనవరాలు అయిన హరిత(నాగ దుర్గ)తో కలిసి ఉంటాడు. ఇక భూమయ్య ఉన్న పాఠశాలను ఆనుకొని ఉన్న ప్రదేశంలో చెట్లను పెంచి దానిని అడవిగా మారుస్తాడు. ఊరిలో ఉన్న ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించినప్పుడే అందరూ బాగుంటారు అని నమ్ముతాడు.. ఇక హరిత సైతం బాగా చదువుకుంటుంది అయిన కూడా ఆమె జాబ్ చేయకుండా ఊర్లో ఉన్న పాఠశాలలోనే పిల్లలకి ఉచితంగా చదువు చెబుతూ ఉంటుంది…ఇకపిల్లలు ప్రకృతి ఒడిలో ఉండి దాన్ని ఆస్వాదించడానికి అలవాటు పడితే ఎవరికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రావు అనే ధోరణిలో ఆమె ఆలోచేస్తోంది… ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ విఠల్ (బిత్తిరి సత్తి) మాత్రం భూమయ్య అడవిగా మార్చిన ఆ ప్రాంతాన్ని కొంతమంది కార్పోరేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకున్నారని, వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేసి విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధిని కల్పిస్తారని చెబుతాడు. దాంతో భూమయ్య ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి హరిత వాళ్లతో ఎలా ఫైట్ చేసింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమాని దర్శకుడు మొదటి నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ గా నడిపిస్తూనే, ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా స్టార్టింగ్ లో కొంతవరకు బోరింగ్ గా అనిపించినప్పటికి కథలోకి ఎంటర్ అయిన తర్వాత మెసేజ్ ని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. కానీ సినిమాలో ఏది కూడా ప్రాపర్ గా వర్కౌట్ కాలేదు. కారణం ఏంటంటే..? ఎమోషనల్ సన్నివేశాలను చాలా సింపుల్ గా తేల్చేశారు. కామెడీ సీన్స్ ను సైతం డెప్త్ గా రాయలేదనే ఫీల్ ప్రతి ఒక్కరికి కలుగుతోంది.
కాన్ఫ్లిక్ట్ కూడా అంత గొప్ప లేకపోవడంతో సినిమా అంత ఎఫెక్టివ్ అనిపించలేదు…వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ బాగుంది. కానీ దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు సినిమాటిక్ గా రాసుకోవాల్సింది. ఇంటర్వెల్ తర్వాత ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్ గా మార్చిన కూడా అది ఎందుకో మెలో డ్రామాలాగా అనిపించింది. ఇక మ్యూజిక్ అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. బిజియం కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు…ఇక సమ్మెట గాంధీ చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్రల్లో నటించాడు.
ఆయన పాత్ర ను చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికి ఊరిలో ఉండే వాళ్ల తాత గుర్తుకొస్తారు. హరితగా నాగ దుర్గ గొప్ప పర్ఫామెన్స్ ఇచ్చింది. ఫోక్ సాంగ్స్ తో అదరగొట్టిన నాగ దుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారడం తన నటనతో ప్రేక్షకులను అలరించడం మంచి విషయం… సినిమాటోగ్రఫీ ఒకే అనిపించింది. ఎడిటింగ్ లోనే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ షార్ప్ గా కట్ చేసి ఉంటే మధ్యలో లాగ్ అయ్యేది కాదు…
బాగున్నవి
కథ
సమ్మెట గాంధీ
బాగోలేనివి
ఎమోషన్స్ మైనస్ అయ్యాయి
సెకండాఫ్ లాగ్ అయింది…
రేటింగ్ : 2/5
ఫైనల్ థాట్ : ప్రకృతి గురించి మెసేజ్ ఇవ్వడం మంచిదే. కానీ దాన్ని స్క్రీన్ మీద కూడా అలానే ప్రజెంట్ చేస్తే బాగుండేది. వీలైతే ఒకసారి చూడండి…