Kajal Aggarwal: తల్లైనా కూడా కాజల్ అందం ఇసుమంతైనా కరగలేదు. పెరిగిన బరువును కఠిన వ్యాయామాలు, ఆహార అలవాట్లతో కరిగించింది. ప్రస్తుతం కాజల్ సూపర్ స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్నారు. మరి కష్టపడి సాధించిన అందాలు దాచేస్తే ప్రయోజనమేముంది. అందుకే పొట్టి డ్రెస్సులేసి ప్రదర్శనకు పెట్టింది. కాజల్ తాజా ఫోటో షూట్ కిరాక్ పుట్టిస్తుంది. ట్రెండీ వేర్ ధరించి సూపర్ సెక్సీ గ్లామర్ తో కుర్ర హృదయాలకు గాయం చేసింది. చాలీ చాలని టాప్ పొడుగుభామ అందాలు దాచలేక ఇబ్బంది పడింది. కాజల్ తీరు చూస్తే కేవలం టాప్ ధరించి కెమెరా ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ కాగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

2020 లో వివాహం చేసుకున్న కాజల్ ఇటీవల పండంటి అబ్బాయికి జన్మనిచ్చారు. కాజల్ కొడుకు పేరు నీల్ కిచ్లు. డెలివరీ కాగానే షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఆ సమయంలో ప్రాణం అంతా ఇంట్లో ఉన్న కొడుకు వద్దే ఉండేదట. కుమారుడికి పాలు ఇచ్చే సమయం కూడా లేక మానసిక వేదన అనుభవించానని కాజల్ అన్నారు. ప్రెగ్నెన్సీ టైం లో మాత్రమే కాజల్ కొంచెం గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది ఆమెను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు.

అదృష్టవంతుల్ని ఎవరూ చెడగొట్టలేరనేది సామెత. కాజల్ కి కూడా కాలం అలానే కలిసొస్తుంది. దాదాపు ఆగిపోయిందనుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారతీయుడు 2 తిరిగి ప్రారంభమైంది. దర్శకుడు శంకర్ యుద్ధ ప్రాతిపదికన భారతీయుడు 2 పూర్తి చేస్తున్నాడు. దీంతో కాజల్ ఆ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. కమల్ లేటెస్ట్ మూవీ విక్రమ్ భారీ విజయం సాధించగా ఆయన ఫార్మ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో భారతీయుడు 2 సంచలనాలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారతీయుడు 2 బాక్సాఫీస్ దున్నేస్తుంది.

భారతీయుడు 2 విజయం సాధిస్తే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ కి శుభారంభం లభించినట్లే. ఈ మూవీలో కాజల్ తో పాటు రకుల్ మరొక హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో కాజల్ ఒక చిత్రం కూడా చేయడం లేదు. మంచు విష్ణుతో చేసిన మోసగాళ్లు కాజల్ కి తెలుగులో చివరి చిత్రం. ఆచార్య చిత్ర షూట్ లో పాల్గొన్న కాజల్ ని తర్వాత తప్పించారు. స్క్రిప్ట్ లో చేసిన మార్పుల కారణంగా చిరంజీవికి జంటగా చేసిన కాజల్ పాత్ర లేపేశారు.ఇక భారతీయుడు 2తో పాటు కాజల్ రెండు తమిళ్, ఇక హిందీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.