Homeఎంటర్టైన్మెంట్Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చెయ్యాలని , అందాల ఆరబోతకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని కొన్ని లిమిట్స్ ని పెట్టుకొని ఆమె తన సినీ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈమె ‘ది ఇండియన్ స్టోరీ’ అనే చిత్రం చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్న ‘రామాయణం’ లో ఈమె రావణుడి భార్య అయినటువంటి మండోదరి పాత్ర పోషించింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదటి భాగం దీపావళి కానుకగా విడుదల కాబోతుంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాజల్ అగర్వాల్ బాలీవుడ్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండియా లో నాకు ఎన్నో అద్భుతమైన పాత్రలు దక్కాయి. నాలోని నటిని బయటకు తీశాయి. అలాంటి పాత్రలు బాలీవుడ్ లో నాకు ఇప్పటి వరకు రాలేదు. అన్ని పనికిమాలిన రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాంటి పాత్రల్లో నటించడానికి నేను సిద్ధంగా లేను. మంచి నాణ్యత ఉన్న సినిమాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నాను. బాలీవుడ్ సెట్ లో క్రమశిక్షణ , సమయపాలన వంటివి పద్దతిగా ఉండవు. సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ సమయం లో నన్ను చాలాసేపు వేచి చూసేలా చేశారు. ఆయన షూటింగ్ కి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో వచ్చేవారు , ఈ గ్యాప్ లో నేను షూటింగ్ సెట్స్ లోనే జిమ్ లో వర్కౌట్స్ చేసుకుంటూ ఉండేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండస్ట్రీ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడి నటీనటులు , టెక్నీషియన్స్ క్రమశిక్షణ పాటిస్తుంటారు. పైగా ఈమధ్య కాలం లో సౌత్ లో వచ్చిన మార్పులు చాలా బాగున్నాయి. ఒకప్పుడు మహిళల బొడ్డులను చూపించేవారు , దాని పై పండ్లు విసిరే సన్నివేశాలు వంటివి చూపించేవారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు , మహిళకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఈమధ్య కాలంలో సౌత్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఈ మార్పు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయలేదు, ఇక నుండి అలాంటి పాత్రలే చేస్తానని అంటోంది కాబట్టి , రామాయణం లో ఆమె ఎలా నటించబోతుందో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version