https://oktelugu.com/

Kajal Aggarwal: కాజల్ తల్లి కాబోతోందా? అందుకే కొరటాలతో.. !

Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తల్లి కాబోతుంది అని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాజల్ గతేడాది పెళ్ళి చేసుకొంది. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుండి తన భర్త గౌతమ్ కిచ్లుతో ముంబైలోనే కాపురం పెట్టింది. మరి ఈ 36 ఏళ్ల చందమామ తల్లి కాబోతుంది అనే వార్త బాగా వైరల్ అవుతుంది గానీ, […]

Written By:
  • admin
  • , Updated On : September 18, 2021 / 12:58 PM IST
    Follow us on

    Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తల్లి కాబోతుంది అని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాజల్ గతేడాది పెళ్ళి చేసుకొంది. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుండి తన భర్త గౌతమ్ కిచ్లుతో ముంబైలోనే కాపురం పెట్టింది.

    మరి ఈ 36 ఏళ్ల చందమామ తల్లి కాబోతుంది అనే వార్త బాగా వైరల్ అవుతుంది గానీ, ఇప్పటి వరకు అయితే కాజల్‌ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయాన్ని ఈ జంట కలిసి అధికారికంగా ప్రకటిస్తారనే టాక్ నడుస్తోంది. కేవలం తాను తల్లి కాబోతున్న సందర్భంగా ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని కాజల్ ప్లాన్ చేసుకుంటుంది.

    ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించి ఇంకా ఆరు సీన్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ షూటింగ్‌ ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా కొరటాల శివను కాజల్ కోరిందట. అలాగే ప్రస్తుతం కాజల్ మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు సినిమాలను ఆల్ రెడీ పూర్తి చేసింది.

    ప్రెజెంట్ మూడో సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా షూట్ పూర్తి కాగానే ఆచార్య షూట్ లో జాయిన్ అవుతుందట. అన్నట్టు కాజల్ హిందీ చిత్రం ‘ఉమ’లో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయింది. మొత్తానికి కాజల్ చేతిలో మరో రెండు నెలలు మాత్రమే ఉందట. ఆ తర్వాత ఇక పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలని నిర్ణయించుకుంది.

    ఇక కాజల్ తల్లి కావాలి అని, అచ్చం కాజల్ లాంటి ఆడపిల్లకు ఆమె జన్మను ఇవ్వాలని కాజల్ చెల్లి నిషా కోరుకుంటూ ఆ మధ్య ఒక ట్వీట్ పెట్టింది.