Kajal Aggarwal: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాజల్-గౌతమ్ కిచ్లు దంపతులకు మంగళవారం (ఏప్రిల్ 19) మగబిడ్డ పుట్టాడు. దాంతో కాజల్ దంపతులకు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుంది, అందాల తార అయినా, అచ్చతెలుగు ఇల్లాలు అయినా అమ్మతనానికి అందరూ అభిమానులే.

అంత గొప్పది తల్లిప్రేమ. అందుకే, తల్లి తనాన్ని ఏ సర్వేతో కొలవలేం, ఏ పదాలతో పోల్చలేం. దేశానికీ రాజు అయినా, తల్లికి బిడ్డే అన్నారు. ఇక ఆ బిడ్డ విషయంలో తల్లి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది చందమామ కాజల్ అగర్వాల్. నిజానికి ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ సుఖ ప్రసవం కోసం ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
Also Read: Naga Chaitanya- Sai Pallavi: చైతు ప్లాట్ లో అడ్డంగా దొరికిన ‘సాయి పల్లవి’
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వేళ ఎలాంటి ఎక్సర్ సైజ్ లు చేయాలో వాటిని తూచా తప్పకుండా చేసింది. పైగా ఓ ప్రత్యేక ట్రైనర్ సమక్షంలో ఈ కసరత్తులు చేసింది. ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. కాజల్ లకి సుఖ ప్రసవం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

మొత్తానికి తల్లిగా కాజల్ అగర్వాల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. పనిలో పనిగా ఇక తాను ఏమి చేసినా తన బిడ్డ కోసమే అంటూ కాజల్ కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చింది. మరి మాతృమూర్తిగా మారిన ఈ అందాల చందమామకు ప్రత్యేక శుభాకాంక్షలు.
Also Read:Tv Anchors: బుల్లితెర స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
Recommended Videos:
[…] Shocking News: ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆత్మహత్యల కథలు విని ఉంటారు. అబ్బాయి మోసం చేశాడని అమ్మయిలు.. లేదంటే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొందరేమో ఇష్టం లేని పెండ్లి చేశారని, మరికొందరేమో సంసారంలో బాధలు భరించలేకపోతున్నామని, పెండ్లాం పెంకిదని, మొగుడు వేధిస్తున్నాడని.. ఇలా అనేక కారణలతో చనిపోయిన వారి గురించి విన్నాం కదా. […]